E-Paper
Advertisement

అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!

అనకాపల్లి స్టేషన్‌లో కుప్పకూలిన బ్రిడ్జి.. రైల్వే ట్రాక్ క్లోజ్!
Advertisement

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో.. భారీ ఐరన్ గడ్డర్లు ఒక్కసారిగా కింద పడ్డాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం  హుటాహుటిన అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందతున్నాయి.

Advertisement

బ్రిడ్జికి సంబంధించిన భారీ ఐరన్ గడ్డర్లు నేరుగా రైల్వే పట్టాలపై పడటంతో, విఖాఖపట్నం వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల పలు రైళ్లు ఇతర స్టేషన్లలోనే ఆగిపోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. భారీ క్రేన్ల సహాయంతో పట్టాలపై పడిన ఇనుప దిమ్మెలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: ఘాట్ రోడ్డులో ఘోరం.. కొండను ఢీకొన్న వ్యాన్, ఎగిరిపడ్డ ప్రయాణికులు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×