E-Paper
Advertisement

విప్రో వార్నింగ్.. వేధింపులు ఏ మాత్రం సహించం, పూణె విషయంలో

విప్రో వార్నింగ్.. వేధింపులు ఏ మాత్రం సహించం, పూణె విషయంలో
Advertisement

Wipro Warning: ఉద్యోగుల సంక్షేమం.. గౌరవం.. మర్యాదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పింది విప్రో. దుష్ప్రవర్తన, వివక్ష, వేధింపులు వ్యక్తి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలకు భంగం కలిగించే చర్యల పట్ల ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

వేధింపులు ఏ మాత్రం సహించం-విప్రో వార్నింగ్

Advertisement

పుణెలోని విప్రో ఆఫీసులో పని చేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని చేసిన ఆరోపణలపై విప్రో రియాక్ట్ అయ్యింది. మతం మారాలని తనను కొందరు సీనియర్‌ మేనేజర్లు, టీం లీడర్లు బలవంతం చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. తమ ఆఫీసుల్లో వివక్ష, వేధింపులను ఎంతమాత్రం సహించబోమని తేల్చి చెప్పేసింది. సదరు మహిళాపై మిగతా ఉద్యోగులు చేసినది రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఉద్యోగుల విషయంలో వారి సంక్షేమం, గౌరవం, స్వేచ్ఛకు భంగం కలిగించకుండా పని కల్పించే విషయంలో నిబద్ధతతో ఉంటామని క్లారిటీ ఇచ్చింది. అలాగే మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలపై పుణె పోలీసుల విచారణకు తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన పలు పత్రాలను సమర్పించినట్లు తెలియజేసింది.

Advertisement

పూణె కేసులో పోలీసులకు సహకారం.. నేరం రుజువైతే బాధ్యులపై చర్యలు

పని ప్రదేశంలో వేధింపులు, వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను అంతర్గత కంపెనీ ప్రక్రియల ద్వారా పరిశీలిస్తామని వివరించింది. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే నేర విచారణ ప్రక్రియ ద్వారా పరిశీలిస్తామని తేల్చేసింది. మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణలు ప్రకారం.. ఒక మహిళా సహోద్యోగి ఇస్లాం మతంలోకి మారమని, ముస్లిం వ్యక్తితో సంబంధం పెట్టుకోమని ఆమెపై పలుమార్లు ఒత్తిడి చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ఆ సహోద్యోగి తన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే వ్యాఖ్యలు చేశారని, హిందూ మతాన్ని విడిచిపెట్టడం వల్ల విదేశాలలో మెరుగైన జీవనశైలి అవకాశాలు, భవిష్యత్తు లభిస్తాయని చెప్పి తనను ప్రోత్సహించారని ఆమె ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జూన్ ఐదున అంటే శుక్రవారం విప్రో సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది.

ALSO READ: దేశంలో మరో మెహతా స్కామ్.. ఏకంగా 15 లక్షల కోట్లు, ఆపై సెబీ నిషేధం

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×