E-Paper
Advertisement

SIM Card: సిమ్ కార్డు అంచున కటింగ్ గమనించారా? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?

SIM Card: సిమ్ కార్డు అంచున కటింగ్ గమనించారా? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?
Advertisement

SIM Card: స్మార్ట్ ఫోన్ లో అమర్చేముందు సిమ్ కార్డును ఎప్పుడైనా పరిశీలించారా? కార్డు చివర ఉండే కటింగ్ ఎందుకు ఉందన్న సందేహం మీకు కలిగిందా? అయితే చాలా మందికి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇది కేవలం సిమ్ కార్డు డిజైన్ కోసమే కాదు దాని వెనుక సిమ్ పనితీరు కూడా ఆధారపడి ఉంది. ఓ భద్రతాపరమైన రహస్యం కూడా దీని వెనుక ఉంటుంది. అసలు సిమ్ కార్డు చివర కటింగ్ ఎందుకు ఉంది? అలా ఉండటానికి కారణాలు ఏంటీ? లేకపోతే సిమ్ కార్డు పనితీరులో చోటుచేసుకునే వైఫల్యాలు ఏంటీ? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

సిమ్ కార్డుల చరిత్ర..

1990లలో మెుట్ట మెుదటి సారి సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే తొలినాళ్లలో సిమ్ కార్డులు.. ప్రస్తుత ఏటీఎం కార్డుల తరహాలో చాలా పెద్దవిగా ఉండేవట. అయితే కాలానుగుణంగా టెక్నాలజీ రావడం, ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడంతో సిమ్ కార్డు సైజుల్లోనూ మార్పు వచ్చింది. సిమ్ కార్డు, మినీ, నానో సిమ్ లుగా పరిణామం చెందాయి. అయితే యూరోపియన్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ (ETSI) ప్రపంచవ్యాప్తంగా సిమ్ కార్డ్ డిజైన్‌ను మార్పులను సూచిస్తూ వచ్చింది. అయితే సిమ్ పరిమాణం మారుతూ వచ్చినప్పటికీ కార్నర్ లో మాత్రం కటింగ్ కొనసాగుతూనే రావడం గమనార్హం.

సరైన దిశలో అమర్చడానికి..

Advertisement

సిమ్ కార్డ్‌ని ఫోన్‌లో పెట్టేటప్పుడు అది ఏ దిశలో ఉండాలో వినియోగదారులకు సులభంగా అర్థం కావడానికి ఈ కట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ సిమ్ కార్డ్ చతురస్రాకారంలో లేదా దీర్ఘచతురస్రాకారంలో (నాలుగు మూలలు సమానంగా) ఉంటే దానిని తలకిందులుగా లేదా రివర్స్‌లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ కట్ ఉన్న మూలను ఆధారంగా చేసుకోవడం ద్వారా మెుబైల్ లోని సిమ్ ట్రేలో దానిని కచ్చితంగా ఫిక్స్ చేసేందుకు వీలు కలుగుతుంది.

చిప్ భద్రత – కనెక్టివిటీ

సిమ్ కార్డ్ లోపల ఉండే బంగారు రంగు చిప్ ఎంతో ముఖ్యమైనది. ఫోన్ లోపల ఉండే రీడర్ పిన్స్ (Reader Pins).. సిమ్ కార్డుపై ఉండే చిప్‌ను కచ్చితమైన పాయింట్ల వద్ద తాకడం ద్వారానే మనం నెట్ వర్క్, డేటా సేవలను పొందగలుగుతాం. ఒకవేళ మనం సిమ్ కార్డును పొరపాటున తప్పు దిశలో పెడితే ఫోన్ లోని పిన్స్ చిప్‌తో సరిగ్గా కనెక్ట్ కాలేవు. దీనివల్ల ఫోన్ నెట్‌వర్క్‌ను గుర్తించదు. అంతేకాకుండా తప్పుగా పెట్టడం వల్ల ఫోన్ లోని సర్క్యూట్ దెబ్బతినడం లేదా చిప్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తలెత్తవచ్చు. ఈ ముప్పు నుంచి తప్పించి సాంకేతిక భద్రతను కల్పించడం కోసం ఈ సిమ్ కటింగ్ సాయపడుంది.

Advertisement

Also Read: Dishwasher Buying Guide: డిష్‌వాషర్ కొనే ముందు.. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి.. లేదంటే బాధ పడాల్సి వస్తుంది!

స్టాండర్డ్ డిజైన్..

ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోన్ కంపెనీలు ఒకే రకమైన సిమ్ స్లాట్లను తయారు చేయడానికి ఈ డిజైన్ ఒక ప్రామాణికంగా (Standard) మారింది. ఫోన్ లో తీసుకొస్తున్న అధునానత ఫీచర్ల తరహాలోనే ప్రతీసారి స్లిమ్ స్లాట్ ను మార్చే అవసరం మెుబైల్ కంపెనీలకు తప్పింది. ఇది పరోక్షంగా మెుబైల్ తయారీ కంపెనీలకు ప్రయోజనాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. దీనివల్ల ఏ కంపెనీ ఫోన్‌లోనైనా ఏ సిమ్ కార్డునైనా సులభంగా వాడవచ్చు.

Also Read: Air Force Recruitment Rally: తెలుగు యువతకు గుడ్ న్యూస్.. భారత వాయుసేనలో చేరే సువర్ణవకాశం!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×