E-Paper
Advertisement

Egg Prices Crash: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్, రైతులు లబోదిబో

Egg Prices Crash: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్, రైతులు లబోదిబో
Advertisement

Egg Prices Crash: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం చాలా రంగాలపై ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కేవలం దిగుమతులు మాత్రమే కాదు.. ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవేళ యుద్ధం ఆగినా తర్వాత చాన్నాళ్లు గాని అక్కడి పరిస్థితుల్లో మార్పులు రావని అంటున్నారు. దాని ప్రభావం తాజాగా కోడిగుడ్ల ధరలపై పడింది. ఫలితంగా 40 శాతం ధరలు పడిపోయాయి. ఒక్కో గుడ్డు.. ఐదు రూపాయల కంటే తక్కువకు  లభ్యమవుతోంది. సామాన్యుడి రిలీఫ్ దక్కినా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సముద్ర మార్గాలు జరిగే కార్గో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో గుడ్లు అమాంతంగా పడిపోయాయి. అధికంగా ఉత్పత్తి రావడంతో ధరలు బాగా తగ్గాయి. నెల కిందటి వరకు రూ. 200ల వరకు 30 గుడ్ల ట్రే అమ్ముడైంది.

తాజాగా రూ.100 నుంచి రూ.130 మధ్య పడిపోయింది.ఈ ఏడాది ఆరంభంలో రిటైల్ గుడ్డుకు రూ.8 నుంచి 10 వరకు పలికింది. మార్కెట్లలో ప్రస్తుతం రూ.5 లకు పడిపోయాయి. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి విదేశీ మార్కెట్లకు 30 కోట్లకు పైగా గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి.

Advertisement

సామాన్యుడికి రిలీఫ్,  లబోదిబోమంటున్న ఫౌల్ట్రీ రైతులు

నార్మల్‌గా అయితే ప్రతీరోజు దేశం నుండి రోజుకు 50 లక్షలకు పైగా గుడ్లు ఎగుమతి అవుతాయి. వీటి ఎగుమతుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుండి ఎగుమతులు అవుతాయి. ఎగుమతులు నిలిపివేయడంతో దేశీయ టోకు ధర ఒక్కో గుడ్డు రూ.3.50 నుంచి రూ.4.30 కి పడిపోయాయి. దీని ప్రభావం పౌల్ట్రీ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఏపీ నుంచి దాదాపు 750 కోళ్ల ఫామ్‌ల నుండి దాదాపు 4 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 1.75 కోట్ల గుడ్లు స్థానికంగా ప్రజలు వినియోగిస్తారు. వీటిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు 2 కోట్ల వరకు గుడ్లు వెళ్తాయి. మిగతా గుడ్లను వివిధ రాష్ట్రాలకు లేకుంటే విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక తమిళనాడులోని నమక్కల్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు ప్రతీ రోజూ కంటెయినర్లలో 35-40 లక్షల గుడ్లను ఎగుమతి చేస్తారు.  పశ్చిమ బెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు గుడ్లు ఎగుమతి చేస్తారు. ఏపీ గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి కానప్పటికీ ఎగుమతులను సరఫరా చేసే నామక్కల్ మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి.

ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పటికి వెళ్లిన గుడ్లను వెనక్కి తేవాల్సి పరిస్థితి ఏర్పడింది. గడిచిన 10 రోజులుగా ఉత్పత్తి అయిన గుడ్ల మార్కెట్‌కు రావడం మొదలైంది. ధరలు దాదాపు 40 శాతం వరకు పతనమైనట్టు ఫౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు గుడ్లు ఎగుమతి చేస్తారు. ఏపీ గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి కానప్పటికీ ఎగుమతులను సరఫరా చేసే నామక్కల్ మార్కెట్‌లో పతనమయ్యాయి. ధరలు చూసి పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటున్నారు.

ALSO READ: మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. టాప్ బ్యాంక్ ఇదే?

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×