// // IPL 2026 Recharge Plans: ఐపీఎల్ 2026 ఫ్రీ స్ట్రీమింగ్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

ఐపీఎల్ 2026 ఫ్రీ స్ట్రీమింగ్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

ఐపీఎల్ 2026 ఫ్రీ స్ట్రీమింగ్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
Advertisement

IPL 2026 Recharge Plans: ఐపీఎస్ 2026 సీజన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసేందుకు జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చాయి. తక్కువ సబ్‌స్క్రిప్షన్‌ తో జియోహాట్‌స్టార్‌ ను ఫ్రీగా యాక్సెస్‌ చేయవచ్చు. రూ.101 నుంచి ఏడాది పొడవునా ఉండే ప్లాన్‌ల వరకు, మీ బడ్జెట్‌కు సరిపోయే సూపర్ ప్లాన్లు ఉన్నాయి.

జియో ఐపీఎల్ ఆఫర్లు

జియో రూ.949 ప్లాన్ ఎక్కువగా ప్రజాదరణ పొందింది. ఈ ప్లాన్ లో 84 రోజుల పాటు రోజుకు 2GB డేటా, 5G కస్టమర్లకు అన్ లిమిటెడ్ డేటా, 3 నెలల పాటు జియోహాట్‌స్టార్‌కు ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్ ఉన్నప్పటికీ, ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను ఈ ప్లాన్ తో ఆస్వాదించవచ్చు. ఇందుకోసం జియో రెండు డేటా వోచర్‌లను తీసుకొచ్చింది. రూ.101కి 5GB డేటా, రూ.195కి 15GB డేటా.. ఈ వోచర్‌లను యాక్టివేట్ చేయడంతో నిరంతరాయంగా ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.

ఎయిర్‌టెల్ ప్లాన్లు

Advertisement

HD క్వాలిటీలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి ఎయిర్‌టెల్ స్పెషల్ రీఛార్జీ ప్లాన్లు అందుబాటులో ఉంచింది. రూ.449 ప్లాన్ లో 28 రోజులకు ప్రతిరోజూ 4GB డేటాను అందిస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ కు ఇది మంచి ప్లాన్. 1029 ప్లాన్ లో 84 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీ గా జియో హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. రూ.3,999 వార్షిక ప్లాన్ లో ఏడాది పాటు వ్యాలిడిటీ OTT ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Vi ఐపీఎల్ ప్లాన్లు

వీఐ ఐపీఎస్ వీక్షకుల కోసం బడ్జెట్‌ ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.101, రూ.151, రూ.175 వోచర్‌లతో స్ట్రీమింగ్ తో పాటు 5GB నుంచి 10GB వరకు అడిషనల్ డేటాను అందిస్తాయి. రూ.248 ప్లాన్ లో నెల మొత్తం మ్యాచ్‌లను నిరంతరాయంగా చూడవచ్చు.

BSNL IPL ప్లాన్లు

Advertisement

ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు బీఎస్ఎన్ఎల్ రూ.499 ప్రత్యేకమైన ఓటీటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో యూజర్లు 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్‌తో పాటు సోనీ లివ్, జీ5 సర్వీసులు ఉచితంగా పొందవచ్చు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, లేటెస్ట్ సినిమాలను కూడా ఇందులో చూడవచ్చు. కానీ ఇందులో డేటా లేదా కాలింగ్ సదుపాయాలు ఉండవు.

Also Read: BSNL IPL Plan: జియో హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ ఐపిఎల్ ధమాకా ప్లాన్ లాంచ్

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×