E-Paper
Advertisement

Vespa 946 Dragon Edition: వెస్పా నుంచి స్పెషల్ స్కూటర్.. ధర రూ. 14.27 లక్షలు..!

Vespa 946 Dragon Edition: వెస్పా నుంచి స్పెషల్ స్కూటర్.. ధర రూ. 14.27 లక్షలు..!
Advertisement

Vespa 946 Dragon Edition Price and Features: దేశీయ మార్కెట్‌లో అధిక మైలేజీ, పర్ఫామెన్స్ అందించే అనేక స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవలే ఇటాలియన్ కంపెనీ పియాజియో వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కింద కంపెనీ ఈ స్పెషల్ వెర్షన్‌ను సేల్‌కు తీసుకొచ్చింది. అలానే గ్లోబల్ మార్కెట్‌లో కంపెనీ ఇప్పటివరకు 1,888 యూనిట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. వెస్పా కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ వెస్పా 946 డ్రాగన్ జాకెట్‌ను కూడా అందిస్తోంది. మోటోప్లెక్స్ డీలర్‌షిప్‌లలో ఈ ఎడిషన్ స్కూటర్ బుకింగ్ ప్రారంభమైంది.

దేశంలో విడుదల చేసిన వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ డిజైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే.. వెస్పా కొత్తగా విడుదల చేసిన స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్కూటర్ 946 స్కూటర్‌ని పోలి ఉండే అవకాశం ఉంది. కొత్త ఎడిషన్‌లో అప్‌డేట్ చేయబడిన పెయింట్, డీకాల్స్ వంటి లేటెస్ట్ డిజైన్ ఇప్పటికే ఉన్న స్కూటర్‌కు డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్‌పై ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లో డ్రాగన్ గ్రాఫిక్స్ చూడటానికి చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ డ్రాగన్ గ్రాఫిక్స్ స్కూటర్ ఫ్రంట్ ఆప్రాన్ నుండి సైడ్ ప్యానెల్ వరకు చూడొచ్చు. దీని మొత్తం బాడీవర్క్‌కి లైట్ గోల్డెన్ కలర్ కోట్‌తో వస్తుంది.

Advertisement

Vespa 946 Dragon Edition Features
వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ స్కూటర్‌లోని ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్కూటర్‌కు రెండు 12-అంగుళాల వీల్స్ ఉంటాయి. స్కూటర్ ముందు భాగంలో కాయిల్ స్ప్రింగ్, వెనుకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్‌తో కూడిన సింగిల్ ఆర్మ్‌ ఉంటుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 8-లీటర్లు. ఇందులో పవర్‌ఫుల్ 125సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజన్ చూడొచ్చు. ఇది అధిక మైలేజ్ కెపాసిటీతో 11.8bhp పవర్, 10.33Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. స్కూటర్‌ను స్టీల్ ప్లేట్ మోనోకోక్ ఫ్రేమ్‌పై తయారు చేశారు.

Also Read: సూపర్ బ్రో.. రూ.56 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్!

Advertisement

వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ ఇటలీ నుండి పూర్తిగా మానుఫ్యాకర్ చేసిన యూనిట్ (CBU) వలె వస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను హాంకాంగ్ చంద్ర నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇది దాని ప్రొఫైల్‌తో పాటు ఎమరాల్డ్ గ్రీన్ ప్రింట్, హెడ్‌ల్యాంప్ క్రింద పచ్చ ఆకుపచ్చ ప్రింటింగ్ కలిగి ఉంటుంది. ఇది శ్రేయస్సుకు చిహ్నం. దీని ధర రూ. 14.27 లక్షల ఎక్స్-షోరూమ్.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×