E-Paper
Advertisement

Credit Card Rules: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? వీటిని అస్సలు కొనొద్దు.. చేశారో చిక్కుల్లో పడ్డట్లే!

Credit Card Rules: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? వీటిని అస్సలు కొనొద్దు.. చేశారో చిక్కుల్లో పడ్డట్లే!
Advertisement

Credit Card Rules: క్రెడిట్ కార్డు ఉంది కదా అని చాలా మంది అవసరం లేకున్నా ఏది పడితే అది కొనుగోలు చేస్తుంటారు. నెల పూర్తయ్యే సరికి దానికి ఇంట్రస్ట్ చెల్లించలేక ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొందరు ఏకంగా ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించి.. విదేశాల్లో ఆస్తులను సైతం కొనుగోలు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దృష్టికి వెళ్లింది. దీంతో దుబాయ్‌లో ఆస్తులు కొన్న పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే?

చాలా మంది భారతీయులు దుబాయ్ వంటి నగరాల్లో ఇళ్లు లేదా ప్లాట్లు బుక్ చేసుకునేటప్పుడు టోకెన్ అమౌంట్ లేదా ఇన్‌స్టాల్‌మెంట్లను తమ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ప్రకారం ఇది నిబంధనలకు విరుద్దం. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం కూడా క్రెడిట్ కార్డు వాడకంపై కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం.. క్రెడిట్ కార్డులను కేవలం వ్యక్తిగత అవసరాలు (షాపింగ్, హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణాలు) వంటి ‘కరెంట్ అకౌంట్’ లావాదేవీలకే వాడాల్సి ఉంటుంది.

సొంత డబ్బుతోనే ఛాన్స్..

Advertisement

విదేశాల్లో ఆస్తులు కొనడం అనేది ఒక పెట్టుబడికి కిందకు వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. దీనిని కేవలం సొంత డబ్బుతో లేదా బ్యాంకు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొంటున్నాయి. అప్పుగా భావించే క్రెడిట్ కార్డును ఉపయోగించి.. విదేశాల్లో స్థిరాస్తులు కొనడం చట్టవిరుద్దమని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగిన నేపథ్యంలో దుబాయి సహా ఇతర దేశాల్లో ఆస్తులు కొన్నవారికి ఆందోళన మెుదలైనట్లు సమాచారం.

విదేశాల్లో ఆస్తి ఎలా కొనొచ్చు..?

ఎల్ఆర్ఎస్ (Liberalised Remittance Scheme) పథకం కింద ఒక భారతీయుడు ఏడాదికి 2,50,000 డాలర్ల వరకు విదేశాలకు పంపేందుకు వీలుంది. అయితే ఈ డబ్బును కేవలం బ్యాంకు ద్వారానే సరైన పత్రాలు సమర్పించి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత డబ్బుతో విదేశాల్లో మీరు కోరుకున్న ఆస్తులను కొనుగోలు చేయవచ్చని రిజర్వ్ బ్యాంకు నిబంధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా తెలియక క్రెడిట్ కార్డు ద్వారా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసి ఉంటే వెంటనే ఆర్బీఐని సంప్రదించి.. సమస్యను పరిష్కరించుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: Jio Cheapest Plans: రోజుకు 3GB డేటా.. కేవలం రూ.39 మాత్రమే.. జియో సూపర్ చీప్ ప్లాన్స్!

క్రెడిట్ కార్డుతో ఈ పనులు చేయద్దు..

సాధారణంగా క్రెడిట్ కార్డుతో కొన్ని పనులు అస్సలు చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విదేశాల్లో స్థిరాస్తులు కొనడంతో పాటు షేర్లు, బాండ్లు, డిబేంచర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు వంటివి చేయడం విరుద్దం. అలాగే విదేశీ లాటరీ, ఫారెన్ వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డు ద్వారా జూదం ఆడటం కూడా నేరమని బ్యాంకింగ్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. విదేశీ కరెన్సీ కొనుగోలు వంటివి  కూడా క్రెడిట్ కార్డును ఉపయోగించి చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Summer Cooling Tips: ఇదిగో బ్యాచిలర్ బాయ్స్.. ఏసీ లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో కూలింగ్ తన్నుకుంటూ వస్తది!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×