E-Paper
Advertisement

Bombay Stock Market: మార్కెట్లను తాకిన యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు

Bombay Stock Market: మార్కెట్లను తాకిన యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు
Advertisement

Bombay Stock Market: అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల పరిణామాలు బాంబే స్టాక్‌ మార్కెట్‌ని ఓ కుదుపు కుదిపేసింది. ఫలితంగా మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు ఒకవైపు.. చమురు ధరల పెరుగుదలతో దారుణంగా పతనం అయ్యాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్‌ 1200 పాయింట్లు పైగా నష్టపోయి ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 350 పాయింట్ల మేరా పతనమై ట్రేడింగ్ కొనసాగుతోంది.

మార్కెట్లను తాకిన ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు

Advertisement

అమెరికా-ఇరాన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. శనివారం ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో సోమవారం ప్రారంభంలో ఆసియా మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2.7 నుంచి వరకు సూచీలు పడిపోయాయి.

దీని ప్రభావం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌పై పడింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1.35 శాతం పడిపోయింది. దాదాపు 1200 పాయింట్లు తగ్గి ట్రేడింగ్ జరుగుతోంది. అటు నిఫ్టీ కూడా 1.40 శాతం తగ్గ 350 పాయింట్లు ట్రేడవుతోంది. నిఫ్టీ-50 ఇండెక్స్‌, నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 0.93, 1.3 శాతం వరకు పడిపోయాయి.  నిఫ్టీ-50 ఇండెక్స్‌, నిఫ్టీ ఆల్ఫా 50, నిఫ్టీ నెక్ట్స్ 50, నిఫ్టీ బ్యాకింగ్, నిఫ్టీ ఫైనాన్స్ రంగాల షేర్లు 1 శాతం నుంచి 1.50 శాతానికి మధ్య పడిపోయాయి.  నిఫ్టీ ఆటో సెక్టార్ షేర్లు ఒత్తిడికి గురికావడంతో రెండుశాతానికి పైగా పడిపోయింది.

Advertisement

భారీ నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు

అటు రూపాయి విలువ భారీగా క్షీణించింది. సోమవారం సెషన్‌లో 24 పైసలు తగ్గి 91.32గా ట్రేడింగ్ అవుతోంది. ట్రేడింగ్‌ ఆరంభంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీగా పతనమైంది. ప్రస్తుతానికి దాదాపు రూ.8లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.  అటు రూపాయి విలువ భారీగా క్షీణించింది. సోమవారం సెషన్‌లో 24 పైసలు తగ్గి 91.32గా ట్రేడింగ్ అవుతోంది.

ట్రేడింగ్‌ ఆరంభంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీగా పతనమైంది. ప్రస్తుతానికి దాదాపు రూ. 8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైనట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధర 80 డాలర్ల పైనే ట్రేడింగ్ అవుతోంది. దాని ప్రభావం దేశీయంగా చమురు కంపెనీల షేర్లపై పడ్డాయి.  యుద్ధం ఆగితే మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది పెరగనున్న జీతాలు.. లేటెస్ట్ సర్వే

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×