E-Paper
Advertisement

TVS Ronin Parakram Custom Bike: టీవీఎస్ సూపర్ ప్లాన్.. కార్గిల్ విజయ్ దివస్‌‌కి గుర్తుగా కొత్త బైక్!

TVS Ronin Parakram Custom Bike: టీవీఎస్ సూపర్ ప్లాన్.. కార్గిల్ విజయ్ దివస్‌‌కి గుర్తుగా కొత్త బైక్!
Advertisement

TVS Ronin Parakram Custom Bike: జూలై 26 దేశం గర్వించే తేదీ. నిజానికి ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటారు. జూలై 26, 1999న కార్గిల్‌లో పాకిస్థాన్‌పై మన సైన్యం విజయం సాధించింది. అప్పటి నుండి ఈ తేదీని కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటారు. ఇప్పుడు ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని టీవీఎస్ దాని ఫేమస్ రోనిన్ బైక్‌ కస్టమ్ వెర్షన్ రోనిన్ పరాక్రమ్‌ను విడుదల చేసింది. కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దీనిని తయారు చేశారు.

TVS రోనిన్ పరాక్రమ్‌లో భారత జెండా కనిపించే విధంగా చాలా కాస్మెటిక్ మార్పులు కనిపిస్తాయి. దీని కారణంగా ఇది స్టాండర్డ్ మోడల్ నుండి చాలా డిఫరెంట్ లుక్‌తో వస్తుంది. దీన్ని వెండి, ఆకుపచ్చ రంగులో తయారు చేశారు. ఇందులో హెడ్‌ల్యాంప్, ట్యాంక్‌పై భారత త్రివర్ణ పతాకంలోని నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగులు కనిపిస్తాయి. భారత సైన్యం ధైర్యసాహసాలను తెలిపే గ్రాఫిక్స్ చుట్టూ కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ బైక్‌ని చూసిన తర్వాత మీరు ఎక్సయిట్ అవుతారు.

Advertisement

పరాక్రమ్ ఫీచర్ల గురించి విషయానికి వస్తే దాని టెయిల్ సెక్షన్ పైన ముందు భాగంలో స్మూత్ వెండి విండ్‌స్క్రీన్, రౌండ్ షేప్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. అదనంగా ఈ బైక్‌లో కొత్త సింగిల్ సీట్ సెటప్, ఎగ్జాస్ట్‌పై సిల్వర్ మెటాలిక్ ఫినిషింగ్,  టెయిల్ సెక్షన్‌లో మెటాలిక్ కవరింగ్, గన్ బుల్లెట్ షేప్ ఇండికేటర్స్ ఉన్నాయి. దీని అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ మోడల్ లాగా ఉంటాయి. వీటిపై ఉండే నాబీ టైర్లు అట్రాక్ట్ లుక్‌ని అందిస్తాయి. ఈ బైక్ లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Also Read: Bajaj Freedom 125 CNG: బజాజ్ CNG.. 3 నెలలు ఆగాల్సిందే.. క్రాష్ టెస్ట్ చేసిన మొదటి బైక్!

Advertisement

ఫీచర్లలో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇది రెయిన్, అర్బన్ ABS మోడ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG), గ్లైడ్ త్రూ టెక్నాలజీ (GTT), పైలట్ లాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.1.50 లక్షలుగా నిర్ణయించింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×