E-Paper
Advertisement

TOYOTA Fortuner: జీరో డౌన్ పేమెంట్ తో టయోటా ఫార్చ్యూనర్ మీ సొంతం.. ఈఎంఐ, పూర్తి వివరాలు ఇలా

TOYOTA Fortuner: జీరో డౌన్ పేమెంట్ తో టయోటా ఫార్చ్యూనర్ మీ సొంతం.. ఈఎంఐ, పూర్తి వివరాలు ఇలా
Advertisement

TOYOTA Fortuner: ఇటీవల కాలంలో చాలా మంది పెద్ద కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా టయోటా ఫార్చ్యూనర్‌ వంటి కార్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఫార్చ్యూనర్ కారును జీరో డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.40 లక్షల రుణంతో ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేసి 5, 7 లేదా 8 సంవత్సరాలు ఈఎంఐ వాయిదాలు చెల్లించవచ్చు. జీరో డౌన్ పేమెంట్‌తో టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేస్తే వాయిదా ఎంత ఉంటుందో తెలుసుకుందాం.

రూ.40 లక్షల రుణం

టయోటా ఫార్చ్యూనర్ సాధారణంగా ఖరీదైన కారు. దీని ఆన్ రోడ్ ధర రూ.38 లక్షల నుండి రూ.50 లక్షల వరకు ఉంటుంది. నగరాలను బట్టి వీటి ధరలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. మీరు కారును ఏ నగరంలో కొనుగోలు చేస్తారనే దానిపై కారు ధర ఆధారపడి ఉంటుంది. మీరు కారును జీరో డౌన్ పేమెంట్‌తో అంటే ఒక్క రూపాయి కూడా ముందుగా చెల్లించకుండా కొనుగోలు చేస్తే.. అందుకు మీరు 40 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు ముందుగా వడ్డీ రేటును అర్థం చేసుకోవాలి.

Advertisement

Also Read: Tata Sierra 2025: సరికొత్తగా టాటా సియెర్రా.. జస్ట్ 11 లక్షల నుంచే అందుబాటులోకి!

ఈఎంఐ వాయిదాలు ఎంత?

ఈ వడ్డీ రేటు మీరు తీసుకున్న లోన్, తిరిగి చెల్లించే వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. మీరు 5, 7 లేదా 8 సంవత్సరాలకు రుణం తీసుకోవచ్చు. 5 సంవత్సరాలకు లోన్ తీసకుంటే.. నెలవారీ ఈఎంఐ రూ.85,000 నుంచి రూ.90,000 వరకు ఉంటుంది. 7 సంవత్సరాలకు అయితే నెలకు రూ.65,000 నుండి రూ.70,000 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 8 సంవత్సరాలకు రుణం తీసుకుంటే మీరు రూ.55,000 నుండి రూ.60,000 వరకు వాయిదా కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్, ఆర్టీవో ఛార్జీలు వీటిల్లో ఉంటాయి. మీరు కారు మొత్తం ధరను ఈఎంఐ వాయిదాల ద్వారా చెల్లిస్తారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×