E-Paper
Advertisement

Vi port Benefits: పాత నెట్‌వర్క్‌తో విసిగిపోయారా? సిమ్ పోర్ట్ పెట్టుకునేవారికి.. వీఐ కళ్లుచెదిరే ఆఫర్లు!

Vi port Benefits: పాత నెట్‌వర్క్‌తో విసిగిపోయారా? సిమ్ పోర్ట్ పెట్టుకునేవారికి.. వీఐ కళ్లుచెదిరే ఆఫర్లు!
Advertisement

Vi port Benefits: ప్రస్తుత రోజుల్లో వాడుతున్న సిమ్ నెంబర్ మార్చే పనిలేకుండానే ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ లోకి తేలిగ్గా మారిపోవచ్చు. ప్రముఖ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్ టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా (Vi) ఈ పోర్టబుల్ సర్వీసులను అందిస్తున్నాయి. అయితే వేరే నెట్ వర్క్ నుంచి తమ నెట్ వర్క్ లోకి మారే వారికి వీఐ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఒకవేళ మీరు వీఐకి పోర్ట్ కావాలనుకుంటే.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటీ? కొత్త కస్టమర్ కు వీఐ అందిస్తోన్న టాప్ – 5 ప్రయోజనాలు ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

అర్ధరాత్రి అపరిమిత ఫ్రీ డేటా..

అర్ధరాత్రి వేళ వీఐ తన కస్టమర్లకు అపరిమిత డేటాను ఉచితంగా అందిస్తోంది. మీరు గనుక వీఐలోకి మారితే మీకు కూడా ప్రయోజనం లభిస్తుంది. అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి డేటా పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఇది మీ రోజువారీ డేటా కోటా నుండి ఏమాత్రం కట్ కాదు.

వీకెండ్ డేటా సౌకర్యం

Advertisement

సోమవారం నుండి శుక్రవారం వరకు మీరు వాడకుండా మిగిల్చిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే వెసులుబాటును వీఐ కల్పిస్తోంది. ఎయిర్ టెల్, జియో వంటి ప్రముఖ టెలికాం సంస్థలు సైతం ఈ విధమైన ప్రయోజనాన్ని తన కస్టమర్ కు అందించకపోవడం గమనార్హం.

అత్యవసర డేటా

ఒక్కోసారి మన రోజూవారీ డేటా పరిమితి దాటితే.. నెట్ స్పీడ్ అమాంతం పడిపోతుంది. ఆ సమయాల్లో ఏదైనా అత్యవసరం ఏర్పడితే మళ్లీ డేటా ప్యాక్స్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ వీఐ తన కస్టమర్ల కోసం రోజూవారీ పరిమితితో సంబంధం లేకుండా అత్యవసర డేటాను అందిస్తోంది. నెలకు 2GB అత్యవసర డేటాను ఆఫర్ చేస్తోంది. 1GB చొప్పున నెలలో రెండుసార్లు ఈ అదనపు డేటాను పొందవచ్చు.

ఉచితంగా వీఐ ఓటీటీ

Advertisement

వీఐ నెట్ వర్క్ లోకి మారడం ద్వారా వీఐ ఓటీటీని ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది. లైవ్ టీవీ ఛానెల్స్, సినిమాలు ఓటీటీ యాప్ ద్వారా ఫ్రీగా చూడవచ్చు. అలాగే వీఐ యాప్ లో గేమ్స్, ఇ- స్పోర్ట్స్ ఆడి.. థ్రిల్లింగ్ రివార్డులు పొందవచ్చు. ఉచిత కాలర్ ట్యూన్స్, వీఐ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై ఆఫర్లు దక్కించుకోవచ్చు. విమానాలు, హోటల్ బుకింగ్స్ పై ప్రత్యేక రాయితీలను సైతం వీఐ తన కస్టమర్లకు అందిస్తుంటుంది.

ఆకర్షణీయమైన ప్లాన్లు

జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే వీఐ రీఛార్డ్ ప్లాన్స్ కాస్త చౌకగా ఉంటాయి. కొన్ని ప్లాన్లపై అధిక డేటాను సైతం పొందవచ్చు. వీఐ తన కస్టమర్లకు ప్రస్తుత 5G డేటాను సైతం అందిస్తోంది. మారుమూల గ్రామాల్లో డేటా నాణ్యతలో కాస్త ఇబ్బందులు ఉండొచ్చు గానీ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో జియో, ఎయిర్ టెల్ కు దీటుగా హైస్పీడ్ డేటా సేవలను పొందవచ్చు.

Also Read: BSNL Annual Plans 2026: వెరీ చీపెస్ట్ ప్లాన్స్.. రోజుకు రూ.3 ఖర్చుతో.. ఏడాదిపాటు ఫ్రీ కాల్స్, 3GB హైస్పీడ్ డేటా!

వీఐకి ఎలా పోర్ట్ అవ్వాలి?

ఇంట్లో కూర్చొని లేదా వీఐ స్టోర్ కు వెళ్లి మీ మెుబైల్ నెంబర్ ను పోర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మీ మెుబైల్ నుండి PORT <space> ఫోన్ నంబర్ టైప్ చేసి 1900 కి SMS చేయాలి. అనంతరం వీఐ నుంచి మీకు ఒక కోడ్ వస్తుంది. అనంతరం మీ ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని దగ్గరలోని వీఐ స్టోర్ లేదా రిటైలర్ వద్దకు వెళ్లండి. ఆ కోడ్ వారికి చెబితే మీకు వీఐ సిమ్ కార్డు ఇస్తారు. పాత సిమ్ సిగ్నల్ ఆగిపోయిన తర్వాత వీఐ సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఇందుకోసం 3-5 రోజుల సమయం పట్టవచ్చు.

Also Read: SIM Card: సిమ్ కార్డు అంచున కటింగ్ గమనించారా? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×