E-Paper
Advertisement

Best Selling Cars In July 2024: జూలైలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్ దీనికే..!

Best Selling Cars In July 2024: జూలైలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్ దీనికే..!
Advertisement

Top 10 best selling cars in July 2024: దేశీయ మార్కెట్‌లో కార్ల వినియోగం క్రమ క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు కారు కొనాలంటే ఎంతో ఆలోచించే కస్టమర్లు.. ఇప్పుడు చాలా ఈజీగా కొనేస్తున్నారు. డౌన్ పేమెంట్ కొంత కట్టి.. మిగతాది ఈఎంఐ రూపంలో నెలవారి చెల్లికుంటున్నారు. ఇలా ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల మార్కెట్‌ కలిగిన దేశంగా భారత దేశం దుసూకుపోతుంది. అయితే దేశంలో ప్రతి నెల ఎన్ని కార్లు సేల్ అయ్యాయి. ఎన్ని కార్లు ఎగుమతి చేయబడ్డాయి అనే రిపోర్ట్‌ను కంపెనీలు వెల్లడిస్తాయి. ఇందులో భాగంగానే గతనెల జులైకి సంబంధించిన కార్ల సేల్స్ బయటకొచ్చాయి. ఇప్పుడు వాటికి సంబంధించి ఫస్ట్ ప్లేస్‌లో ఏ కంపెనీ కార్లు ఉన్నాయో తెలుసుకుందాం.

తాజాగా వెల్లడైన గత నెల సేల్స్ రిపోర్ట్‌ ప్రకారం.. హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ మొదటి స్థానంలో నిలిచింది. అదే సమయంలో మారుతి సుజుకి నుంచి ఆరు కార్లు, టాటా నుంచి రెండు కార్లు, మహీంద్రా నుంచి ఒక కారు టాప్ 10లో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ గత నెల జులై 2024లో అత్యధికంగా సేల్ అయిన కారుగా నిలిచింది. జులై 2024లో క్రెటా 17,350 యూనిట్లు సేల్ అయ్యాయి. అదే సమయంలో గతేడాది జులై 2023లో 14,062 యూనిట్లను సేల్ చేసింది. దీని ప్రకారం గతేడాది కంటే ఈ ఏడాది జులైలో క్రెటా 23.38 శాతం వృద్ధిని సాధించిందనే చెప్పాలి. ఈ కారు రూ.11 లక్షల నుంచి 20.15 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంది.

Advertisement

Also Read: ఏంటి భయ్యా ఈ అరాచకం.. హ్యుందాయ్ కార్లపై రూ.90 వేల వరకు డిస్కౌంట్స్..!

దీని తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. జులై 2024లో 16,854 యూనిట్ల కార్లు సేల్ అయ్యాయి. అదే సమయంలో జులై 2023లో 17,896 యూనిట్లు సేల్ జరిగాయి. దీని ప్రకారం చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది సేల్స్ 5.82 శాతం క్షీణించాయి అని చెప్పుకోవచ్చు. కాగా ఈ కారు రూ.6.49 లక్షల నుంచి 9.60 లక్షల మధ్య ఉంది. దీని తర్వాత మారుతి సుజుకి వ్యాగర్ ఆర్ హ్యాచ్‌బ్యాక్ మూడో ప్లేస్‌లో ఉంది. ఇది జులై 2024లో 16,191 యూనిట్లు సేల్ జరిగాయి. జులై 2023లో 12,970 యూనిట్లు అమ్మకం జరిగాయి. అంటే 24.83 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Advertisement

టాటా పంచ్ జులై 2024లో 16,121 ఫ్యూయల్ ఎలక్ట్రిక్ కార్లను అమ్మి నాలుగో స్థానంలో నిలిచింది. ఇది జులై 2023లో 12,019 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీని ప్రకారం ఇది 34.13 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి ఎర్టిగా మోడల్ సేల్స్ అధికంగా పెరిగాయి. ఏకంగా 15,701 యూనిట్లతో ఐదో స్థానంలో ఉంది. మారుతి బ్రెజ్జా 14,676 యూనిట్ల సేల్స్‌తో ఆరో స్థానం, టాటా నెక్సాన్ 13,902 యూనిట్లు, మహీంద్రా స్కార్పియో 12,237 యూనిట్లు, మారుతి ఈకో 11,916 యూనిట్లు, మారుతి డిజైర్ 11,647 యూనిట్లు ఆ తర్వాత ప్లేస్‌లో నిలిచాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×