E-Paper
Advertisement

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఈరోజు రేట్లు ఇవే!

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఈరోజు రేట్లు ఇవే!
Advertisement

Gold Rate Today: మన సంస్కృతిలో బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కేవలం ఆభరణాల కోసమే కాకుండా.. సురక్షితమైన పెట్టుబడిగా కూడా చాలామంది పసిడిని ఎంచుకుంటారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ కారణాల వల్ల వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో 18 క్యారెట్, 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలతో పాటు వెండి తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు:
హైదరాబాద్‌లో పసిడి కొనుగోళ్లు ఎల్లప్పుడూ జోరుగా సాగుతుంటాయి. ప్రస్తుత మార్కెట్ అప్‌డేట్ ప్రకారం నగరంలో 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,18,770 వద్ద కొనసాగుతోంది. సాధారణంగా డైమండ్ జ్యువెలరీ తయారీలో ఈ రకం బంగారాన్ని ఎక్కువగా వాడుతుంటారు.

Advertisement

ఇక నిత్యం మహిళలు ఆభరణాల కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ. 1,45,150 పలుకుతోంది. అలాగే అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల  24 క్యారెట్ల బంగారం ధర 1,63,470  వద్ద ట్రేడ్ అవుతోంది. వీటితో పాటు వెండి ధర కిలోగ్రాముకు రూ. 2,85,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో తాజా రేట్లు:
ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద బులియన్ మార్కెట్ కలిగిన ఢిల్లీలో స్థానిక పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. ఇక్కడ 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు దాదాపు రూ. 1,19,730 గా ఉంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,230 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.

Advertisement

ఢిల్లీలో ప్యూర్ గోల్డ్ , వెండి ధర:
ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,59,640 కి చేరింది. అదే సమయంలో పారిశ్రామిక అవసరాలు , కొనుగోళ్ల డిమాండ్ కారణంగా ఇక్కడ ఈరోజు కిలో వెండి ధర సుమారు రూ. 2,70,780 గా నమోదైంది.

ఆర్థిక రాజధాని ముంబైలో పసిడి హవా:
దేశ ఆర్థిక రాజధాని ముంబైని అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం నేరుగా శాసిస్తుంది. ఇక్కడి బులియన్ మార్కెట్ ధరలు దేశవ్యాప్తంగా ప్రామాణికంగా మారుతుంటాయి. ముంబైలో 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,19,850 గా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 1,46,380 వద్ద లభిస్తోంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం, వెండి:
ముంబై నగరంలో 99.9% స్వచ్ఛత గల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ. 1,59,800 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే.. ఇక్కడ కిలో వెండి రేటు రూ. 2,71,250 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నై, కోల్‌కతా వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ముంబైలో ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి.

ధరల్లో మార్పులకు ముఖ్య కారణాలు ఇవే:
బంగారం రేట్లు పెరగడానికి అంతర్జాతీయంగా కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సురక్షిత పెట్టుబడిగా బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం వల్ల దిగుమతి వ్యయం పెరిగి దేశీయంగా ధరలు పెరుగుతాయి. అలాగే ప్రభుత్వం బంగారంపై విధించే కస్టమ్స్ డ్యూటీ, స్థానిక పన్నులు కూడా ఈ మార్పులకు కారణమవుతాయి.

గమనిక:
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం మార్కెట్ ఓపెనింగ్ సమయానికి సేకరించినవి. వీటిపై స్థానిక జ్యువెలరీ షాపుల్లో జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీల అదనంగా ఉంటాయని గమనించగలరు. కాబట్టి కొనుగోలు చేసే ముందు లైవ్ రేట్లను సరిచూసుకోవడం మంచిది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×