E-Paper
Advertisement

Aviation Sector: దేశంలోకి కొత్తగా మూడు ఎయిర్‌‌‌లైన్స్ సంస్థలు.. వచ్చే ఏడాది నుంచి మొదలు

Aviation Sector: దేశంలోకి కొత్తగా మూడు ఎయిర్‌‌‌లైన్స్ సంస్థలు.. వచ్చే ఏడాది నుంచి మొదలు
Advertisement

Aviation Sector: ఇండిగో సంక్షోభం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే దేశీయ విమానరంగం ఈ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్టు ప్రజలకు తెలిసింది. పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో మూడు ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందుకొచ్చాయి.

Advertisement

దేశంలోకి కొత్తగా మూడు ఎయిర్‌‌‌లైన్స్ సంస్థలు

ఇప్పటికే Shankh Air సంబంధిత మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందింది. ఇక Al Hind Air, Fly Express ఈ వారం తమ ఎన్ఓసీలు పొందినట్టు వెల్లడించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు సాగించనున్నాయి.  ఈ విషయాన్ని కేంద్రమంత్రి స్వయంగా తెలిపారు.

Advertisement

భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్న మూడు కొత్త ఎయిర్‌లైన్‌ల సంస్థలైన Shankh Air, Al Hind Air, Fly Express సంస్థ ప్రతినిధులతో వారం రోజులుగా సమావేశం కావడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదకగ రాసుకొచ్చారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖ నుంచి Shankh Air నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందినట్టు తెలిపారు 

వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు మొదలు

ఇక Al Hind Air , FlyExpress సంస్థలు ఈ వారం తమ ఎన్సిలను పొందినట్టు తెలిపారు. UDAN పథకం కింద ద్వారా Star Air, India One Air, Fly91 వంటి చిన్న విమానయాన సంస్థలు దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని బలపర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ రంగంలో విస్తృత వృద్ధికి అవకాశాలను స్పష్టం చేస్తున్నాయని రాసుకొచ్చారు.

మోడీ ప్రభుత్వ విధానాల కారణంగా ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ రంగం అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భారతీయ విమానయానంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించడం మంత్రిత్వ శాఖ ప్రయత్నమని రాసుకొచ్చారు.  ఇవి వాణిజ్య కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

డిసెంబర్ నెల ప్రారంభంలో ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభం నుంచి కేంద్రం పాఠాలు నేర్చుకుంది. ఈ నేపథ్యంలో కొత్త విమానయాన సంస్థలకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఇండిగో విమానయాన సంస్థ అతి మార్కెట్ వాటా కలిగివుంది. ఆగస్టు 2025 నాటికి దేశీయ విమానయాన మార్కెట్‌లో ఆ సంస్థది దాదాపు 64 శాతం వాటా ఉంది.

ALSO READ:  న్యూఇయర్ నుంచి ఐసీఐసీలో షాక్.. కస్టమర్లకు కొత్త బాదుడు

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది కూడా. ఆ తర్వాత స్థానాల్లో ఎయిర్ ఇండియా -సుమారు 27.3 శాతం, ఆకాశ ఎయిర్- 5.4 శాతం, స్పైస్‌జెట్ -2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశంలో ఇండిగో సంస్థ ఆధిపత్యం కొనసాగుతోంది.

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×