E-Paper
Advertisement

PM Kisan Yojana 2024 : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!

PM Kisan Yojana 2024 : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!
Advertisement

PM Kisan Yojana 2024 : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నారు. అయితే  పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Also Read : చరిత్ర సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్

ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.

Advertisement

PM కిసాన్ యోజన e-KYC ప్రాసెస్ ఎలా చేయాలి..?

  •  రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.
  • తర్వాత బయోమెట్రిక్ ద్వారా సులభంగా e-KYC పూర్తి చేయవచ్చు.
  • అనేక బ్యాంకుల్లో PM కిసాన్ యోజన కోసం E-KYC అందుబాటులో ఉంది.
  • ఇది కాకుండా రైతు కావాలనుకుంటే అతను PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) ద్వారా సులభంగా ఈ-కేవీసీని పొందవచ్చు.
  • ఇందులో ఈ-కేవైసీ ఓటీపీ ద్వారా జరుగుతుంది.
  • ప్రభుత్వం ప్రారంభించిన PM కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా E-KYC సులభంగా చేయవచ్చు.
Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×