E-Paper
Advertisement

ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. 95 డాలర్లు పైనే, ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్

ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. 95 డాలర్లు పైనే, ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్
Advertisement

Crude Oil Price Hit: నాలుగైదు రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముదిరింది. కేవలం దాడులు చేసుకోవడమే కాదు.. అధినేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఇవాళ మార్కెట్లో బ్రెండ్ క్రూడ్ ధర 95 డాలర్లు దాటి ట్రేడింగ్ అవుతోంది. ఇది కంటిన్యూ అయితే దేశంలో ఆయిల్ ధరలు పెరడగం ఖాయమనే వాదన అప్పుడే మొదలైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో భగ్గుమన్న ఆయిల్ ధరలు- పశ్చిమాసియాలో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకపై ఇరాన్ దాడి చేసిన ప్రతిసారీ ఆదేశ వంతెనలు, విద్యుత్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. కొద్దిసేపటికే ఇరాన్‌పై వరుసగా 12వ రోజు దాడులు చేపట్టింది అమెరికా సైన్యం. ఆ ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలు కొనసాగినంత కాలం హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలో ఉంటుందని, పూర్తిగా మూసి వేయబడుతుందని ఇరాన్ గార్డ్స్ స్పష్టం చేసింది.

Advertisement

బాబ్ ఎల్-మండేబ్- హోర్ముజ్ జలసంధి పరిస్థితులు– ఈ ప్రకటన తర్వాత ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు.. బాబ్ ఎల్-మండేబ్ జలసంధి ద్వారా సౌదీ చమురును రవాణా చేసే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించాయి. ఎర్ర సముద్రంలో హౌతీల దిగ్బంధనం, హోర్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో మైన్లు అమర్చారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చేసిన ప్రకటన కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాల అంతరాయాలపై ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయి.

గురువారం మార్కెట్ ఏంటి? ఫలితంగా గురువారం మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆరు వారాల గరిష్ఠానికి చేరింది. ఇవాళ బ్యారెల్‌ ధర 95 డాలర్లు పైగానే ట్రేడింగ్ జరుగుతోంది. జూన్ 8 తర్వాత అత్యధిక స్థాయి ఇదే. గత సెషన్‌లో బెంచ్‌మార్క్ 3 డాలర్ల కంటే ఎక్కువ పెరిగి ఆరు వారాల గరిష్ట స్థాయికి కొద్దిగా దిగువన అంటే 94.07 డాలర్ల వద్ద స్థిరపడింది. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 88 డాలర్ల పైగానే ఉంది. కేవలం ఒక్క నెలలో బ్రెంట్ క్రూడ్‌ ధర దాదాపు 30శాతం పెరిగింది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

మరోవైపు అమెరికాలో గత వారం ముడి చమురు నిల్వలు 2 మిలియన్ బ్యారెళ్లు పెరిగాయి. రిఫైనరీ కార్యకలాపాలు మందగించడం, ముడి చమురు ఎగుమతులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో ఈ పెరుగుదల సంభవించిందని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. ఇదిలా కంటిన్యూ అయితే ఈ వారం చివరినాటికి బ్యారెల్ ధర 100 డాలర్లను తాకినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నాయి. దీని ప్రభావం దేశీయంగా ధరలు పెరిగే అవకాశముందని అంటున్నాయి.  మరో వారం రోజుల్లో నెల పూర్తి కానున్న నేపథ్యంలో లీటర్ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచే అవకాశముందని చెబుతున్నాయి.

ALSO READ: పసిడి షాక్.. కొండెక్కి కూర్చున్న బంగారం ధరలు.. ఆషాఢం ఎఫెక్టేనా!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×