E-Paper
Advertisement

OpenAI – TCS Deal: ఏఐ రంగంలో టాటా సంచలనం.. చాట్ జీపీటీ మాతృ సంస్థతో.. టీసీఎస్ బిగ్ డీల్

OpenAI – TCS Deal: ఏఐ రంగంలో టాటా సంచలనం.. చాట్ జీపీటీ మాతృ సంస్థతో.. టీసీఎస్ బిగ్ డీల్
Advertisement

OpenAI – TCS Deal: అమెరికాకు చెందిన ఏఐ దిగ్గజం, చాట్ జీపీటీ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐ (Open AI)తో.. భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ (TCS) భారీ ఒప్పందం చేసుకుంది. అధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే లక్ష్యంతో దేశంలో ఏఐ మౌలిక సదుపాయాల్ని నిర్మించాలని టాటా గత కొన్ని రోజులుగా భావిస్తోంది. ఇందుకోసం ఓపెన్ ఏఐ సాయం, సహకారం కోరుతూ ఆ సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిపై గురువారం అధికారిక ప్రకటనను సైతం ఇరు సంస్థల అధినేతలు విడుదల చేశారు.

ఎంటర్ ప్రైజెస్, కన్జ్యూమర్, సోషల్ సెక్టార్లలో అధునాతన ఏఐ ఆవిష్కరణల కోసం అంగీకారం కుదిరాయని ఓపెన్ ఏఐ, టీసీఎస్ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము సృష్టించే మౌలిక సదుపాయాలు.. భవిష్యత్ తరం ఏఐ వర్క్ లోడ్స్ (Next-generation AI workloads) కు శక్తిని ఇస్తాయని.. భారత్ ను ఏఐ కేంద్రంగా నిలుపుతాయని పేర్కొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రారంభం దశలో 100 మెగా వాట్ ఏఐ డేటా సెంటర్లను భారత్ లో అభివృద్ధి చేయనున్నారు. దీనిని భవిష్యత్తులో 1 గిగావాట్ సామర్థ్యం వరకూ పెంచనున్నారు.

Advertisement

Also Read: Solar AC in India: సోలార్ ఏసీ వల్ల లాభాలేమిటీ? ఎంత ఖర్చవుతుంది? కరెంట్ బిల్లు తగ్గుతుందా!

తాజా ఒప్పందం ప్రకారం టాటా గ్రూప్ లోని వేలాది మంది ఉద్యోగులకు ChatGPT Enterprise టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇది ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్ పెంచడానికి దోహదం చేయనుంది. అలాగే టీసీఎస్ ఓపెన్ ఏఐ కోడెక్స్ (OpenAI Codex)ను ఉపయోగించి సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ఔట్ కమ్ ను సైతం మెరుగుపరచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారతదేశ యువతకు ఏఐ, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పై ఓపెన్ ఏఐ, టీసీఎస్ సంయుక్తంగా శిక్షణ అందించనున్నాయి.

Advertisement

Also Read: Viral Video: పబ్లిక్ మీటింగ్.. దేశాధ్యక్షుడిపై వాంతు చేసుకున్న వృద్ధుడు.. అందరూ షాక్!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×