E-Paper
Advertisement

Saving Tips: అనవసర ఖర్చులు తగ్గించుకునే 5 పొదుపు చిట్కాలు

Saving Tips: అనవసర ఖర్చులు తగ్గించుకునే 5 పొదుపు చిట్కాలు
Advertisement

Saving Tips: లక్షల్లో జీతం వస్తున్నా నెలాఖరుకు ఖాతాలో చిల్లిగవ్వ కూడా ఉండడంలేదు. ఈ మాటలు తరచూ వింటుంటాం. అయితే అనవసరపు ఖర్చులు కంట్రోల్ చేసుకుంటే పొదుపు పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ఐదు పొదుపు చిట్కాలేంటో తెలుసుకుందాం.

ఖర్చు ఫిక్స్ చేసుకోండి

మీ అవసరాలేంటో ముందుగా గుర్తించి, వాటిపై వారానికి ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోండి. మీరు ఫిక్స్ చేసుకున్న లిమిట్ పూర్తైతే, ఆపై ఖర్చు చేయకండి. వీక్లీ ఖర్చు కంట్రోల్ చేస్తే నెల వారీ ఖర్చులు తగ్గినట్టే.

ఖర్చులు ట్రాక్ చేయండి

Advertisement

పొదుపులో మొదటి చిట్కా.. అదనపు ఖర్చులను కంట్రోల్ చేయడం. టీ, కాఫీలు, బయటి ఫుడ్, ఆన్ లైన్ ఆర్డర్లపై తరచుగా చేసే చిన్న చిన్న ఖర్చులు పెద్ద మొత్తంలోనే ఉంటాయి. అందుకే వారం లేదా నెలలో మీరు చేసే ప్రతీ ఖర్చును ఓ పుస్తకంలో రాసుకోండి. వారం లేదా నెల తర్వాత వాటిని లెక్కిస్తే ఎక్కడ డబ్బు వృథా అవుతుందో తెలుస్తుంది. అనవసర ఖర్చులను కంట్రోల్ చేయండి.

బయటి ఫుడ్ వద్దు

ఇప్పుడు బయటి ఫుడ్ తినడం బాగా అలవాడు అయింది. బయటి ఫుడ్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మనకు తెలియకుండానే డబ్బు వృధా అవుతుంది. ఇంటి భోజనం చేస్తే ఆరోగ్యంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఇంట్లోనే కొత్త వెరైటీలు ట్రై చేయండి. దీంతో బయటి ఫుడ్ పై ఇంట్రెస్ట్ తగ్గుతుంది.

అనవసర సబ్‌స్క్రిప్షన్లకు నో

Advertisement

ఓటీటీ, ఇతర యాప్ ల సబ్‌స్క్రిప్షన్లకు ఆటో రెన్యూవల్ చేయండి. మీరు ఉపయోగించని యాప్ ల సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేసుకోండి. యాప్స్ ఆటో రెన్యూవల్ ఆపితే మీ ఖర్చును కంట్రోల్ చేసుకోవచ్చు.

Also Read: దావోస్‌లో చంద్రబాబు, లోకేష్ ఇన్వెస్ట్‌మెంట్ వేట.. ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో భారీ ఒప్పందాలు!

పొదుపు మార్గాలు

మీకు జీతం అందిన వెంటనే కొంత డబ్బును పొదుపు అకౌంట్ ట్రాన్స్ ఫర్ చేసుకోండి. ఇందుకు ఆటోమేటిక్ మార్గం పెట్టుకోండి. మీ మెయిన్ అకౌంట్ లో డబ్బులేనప్పుడు, పొదుపు ఖాతా మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బును అప్పుడూ రిజర్వ్ గా పెట్టుకోండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×