E-Paper
Advertisement

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

Stock Markets Crash: శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్.. బేర్ విజృంభణ, కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు
Advertisement

Stock Markets Crash: ముంబై స్టాక్‌మార్కె‌ట్‌‌లో బేర్ ఓ రేంజ్‌లో విజృంభించింది. దీంతో శుక్రవారం దలాల్‌స్ట్రీట్ ఒక్కసారిగా వణికింది. ఏకంగా బెంచ్ మార్క్ సూచీలు కుప్పకూలాయి. సూచీలు తేరుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా మూడు సెషన్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 982,,  నిఫ్టీ దాదాపు 268 పాయింట్లు పతనమైంది.

శుక్రవారం వణికిన దలాల్ స్ట్రీట్

Advertisement

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. ఫలితంగా శుక్రవారం ముంబై స్టాక్ మార్కెట్‌లో బెంచ్‌ మార్క్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. నార్మల్‌గా సెన్సెక్స్ నష్టపోయినా మధ్యలో తేరుకునేది.. ఆ తరహా సందర్భాలు ఉన్నాయి.

శుక్రవారం మాత్రం బేర్ విజృంభణతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, ఐటీ స్టాక్స్ భారీ పతనం కావడంతో మధుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ స్వల్పంగా లాభాలతో మొదలైంది. 9.20 నుంచి 10 గంటల వరకు మార్కెట్ పతన క్రమంగా పెరుగుతూ వచ్చింది.

Advertisement

బేర్ విజృంభణతో కుప్పకూలిన బెంచ్ మార్క్ సూచీలు

ఒకానొక దశలో విదేశీ మదుపరులు అమ్మకాలకు పాల్పడ్డారు. మధ్యాహ్నం అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాల్లోకి చేరకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, చివరి సెషన్‌లో కూడా బీఎస్ఈ 1000 పాయింట్లు పతనం కంటిన్యూ అవుతూ వచ్చింది. అటు నిఫ్టీది అదే పరిస్థితి. దాదాపు 270 పాయింట్లు పతనమయ్యాయి.

భారీగా పతనమైనా వాటిలో ఐటీ సెక్టార్ 4 శాతం నష్టపోయింది. వాటిలో ఇన్ఫోసిస్, కోఫోర్జ్, విప్రో, హెచ్‌సిఎల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్ల భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.28 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 1.35 శాతం పైగానే క్షీణించింది.

ALSO READ: ఉద్యోగం కోల్పోయారా? పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?

ఏ మాత్రం మదుపరులను కోలుకోకుండా చేసింది బేర్. సిరామిక్ ప్రొడక్స్, ప్లాక్టిక్ అండ్ పాలిమర్స్, ఎడ్యుకేషన్ సెక్టార్ మాత్రమే కాస్త బుల్ జోరు కనిపించింది. మిగతా సెక్టార్లు ఏ మాత్రం కోలుకోలేదు. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 970 పాయింట్లు పతనమైంది. దాదాపు 1.32 తగ్గి 76,700.51 వద్ద ముగిసింది.

అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 260 తగ్గి 23,900 ఎగువన ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణిని కనబరిచాయి. హాంగ్ సెంగ్ ఇండెక్స్ నష్టాల నుండి కోలుకుని 0.2 శాతం పెరిగింది. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.1 శాతం తగ్గింది. దక్షిణ కొరియా కోస్పి దాదాపు స్థిరంగా ముగిసింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×