E-Paper
Advertisement

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం.. 24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ
Advertisement

Stock Market Crash: అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం, ఫెడ్ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచడంతో అమ్మకాలకు పాల్పడ్డారు. మార్కెట్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మూడు సెషన్లలోనూ నష్టాలను చవిచూసింది.

స్టాక్ మార్కెట్లో బేర్ వీర విహారం

Advertisement

బాంబే స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు దేశీయ మార్కెట్‌పై పడింది. బీఎస్ఈ సెన్సెక్స్‌ ఒకానొక దశలో 1200 పాయింట్లు పైగానే నష్టపోయింది. మరోసారి నిఫ్టీ 24 వేల దిగువన ముగిసింది.

బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.5 లక్షల కోట్లు పతనమైంది. మదుపరులు అమ్మకాలకు పాల్పడడంతో రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.464 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక ఇంట్రాడేలో 76,258 వద్ద కనిష్ఠాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి 582 పాయింట్ల నష్టంతో 76,913 వద్ద ముగిసింది.

Advertisement

24 వేల దిగువకు నిఫ్టీ, 580 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ

అటు నిఫ్టీ ఒకానొక దశలో 350 పాయింట్లు పైగా పతనమైనా, ముగిసే సమయానికి 180.10 పాయింట్లు కోల్పోయింది. ఇక డాలరుతో రూపాయి మారకం 95 మార్కు దాటినా, చివరకు 94.90కి చేరింది. సెన్సెక్స్‌-30 సూచీలో హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి.

సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు కాసింత లాభపడ్డాయి. ఇక నిఫ్టీ విషయానికి వద్దాం.  నిఫ్టీ-50 సూచీలో 34 స్టాక్‌లు నష్టాలతో ముగిశాయి. వాటిలో ఎటర్నల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, హిండాల్కో ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

ALSO READ: వన్ ప్లస్, రియల్ మీ విలీనం.. ఒప్పో సబ్ బ్రాండ్‌లపై కీలక నిర్ణయం

వివిధ రంగాల విషయానికి వద్దాం. నిఫ్టీ మెటల్ 2 శాతం పైగానే నష్టపోయింది. ఆ తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు ఒక్కో శాతం కంటే ఎక్కువగా  క్షీణించాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు చెరో 1 శాతం మేరా నష్టపోయాయి. గత ఏడాది జూలై నుంచి ఎఫ్‌ఐఐలు నెలవారీగా క్యాష్ సెగ్మెంట్‌లోని దేశీయ షేర్లు అమ్ముతూ వచ్చారు. ఏప్రిల్ నెలలో జరిగిన అమ్మకాలు దాదాపు రూ. 62,000 కోట్లకు పైగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×