E-Paper
Advertisement

Silver At Rs 2.5 Per Kg: ఆల్ టైమ్ హైలో వెండి ధర.. ఇంతకీ ఇప్పుడు కొనలా ? వద్దా ?

Silver At Rs 2.5 Per Kg: ఆల్ టైమ్ హైలో వెండి ధర.. ఇంతకీ ఇప్పుడు కొనలా ? వద్దా ?
Advertisement

Silver At Rs 2.5 Per Kg: వెండి ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. చరిత్రలో తొలిసారిగా కేజీ వెండి ధర రూ. 2.5 లక్షలకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో వెండికి విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. సామాన్య ప్రజలు,పెట్టుబడిదారులు ఒక డైలమాలో పడ్డారు. “ఇంతకీ ఇప్పుడు వెండిని కొనొచ్చా? లేదా ధరలు తగ్గే వరకు ఆగాలా ?”  దీనికి సంబంధించి నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:

డిమాండ్ : వెండిని కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు , బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగించడం చాలా వరకు పెరిగింది.

Advertisement

సరఫరా : గత కొన్ని సంవత్సరాలుగా వెండి తవ్వకాలు డిమాండ్‌కు తగ్గట్టుగా పెరగలేదు. దీని వల్ల మార్కెట్‌లో వెండి నిల్వలు తగ్గిపోయాయి.

కస్టమర్ల ఆసక్తి: స్టాక్ మార్కెట్లలో సప్లై తగ్గినప్పుడు, వెండి, బంగారం వైపు పెట్టుబడిదారులు చాలా మంది మొగ్గు చూపుతారు. వెండి ఈటీఎఫ్‌లు (ETFs), డిజిటల్ సిల్వర్ వైపు ప్రస్తుతం చాలా మంది ఆకర్షితులవుతున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుతం ఎక్కువ ధరకు కొని పెట్టుబడి పెట్టే విషయంలో నిపుణులు రెండు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్త అవసరం: మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..ధరలు ఇంత వేగంగా పెరిగినప్పుడు వెండి కొనడం కొంత రిస్కే. “అందరూ ఒకేసారి ఎగబడి కొంటున్నప్పుడు మార్కెట్‌లో ఏదో తేడా ఉందని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా రాబోయే కొద్ది రోజుల్లో 10% నుంచి 15% వరకు ధర తగ్గే అవకాశం ఉందని, అప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి ?

మీరు వెండిపై పెట్టుబడి పెట్టాలనుకుంటే మీ సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి.

Also Read: పర్సనల్ లోన్ ఉండగానే వ్యక్తి మరణిస్తే.. ఆ అప్పు ఎవరు కట్టాలి ? చట్టం ఏం చెబుతోంది ?

షార్ట్ టర్మ్- ఇన్వెస్టర్లు: ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి.. లాభాలు అనుకున్నంతగా వస్తే.. ధరలు అకస్మాత్తుగా పడిపోవచ్చు. అందుకే కొత్తగా పెట్టుబడి పెట్టేవారు కొన్ని రోజుల తర్వాత కొనడం మంచిది.

లాంగ్ టర్మ్- ఇన్వెస్టర్లు : మీరు 2-3 ఏళ్ల కోసం చూస్తున్నట్లయితే.. వెండి ఒక అద్భుతమైన ఆస్తి. అయితే.. ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా.. SIP (Systematic Investment Plan) పద్ధతిలో ప్రతి నెలా లేదా ధర తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనడం తెలివైన పని.

భవిష్యత్తు అంచనాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఒక ‘ఔన్స్’ ధర 100 డాలర్ల దిశగా పయనిస్తోంది. ఇది నిజమైతే..ఇండియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర 3 లక్షల రూపాయలను కూడా దాటవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. ధరలు నిరంతరం పెరుగుతూనే ఉండవు. ప్రస్తుతం ఉన్న ధర దగ్గరే ‘ప్రాఫిట్ బుకింగ్‘ జరిగితే కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి.. కొత్తగా పెట్టుబడి పెట్టేవారు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా.. ప్రతి నెలా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం మంచిది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×