E-Paper
Advertisement

Stock Market New Benchmark: నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. భారీగా లాభాలు.. కానీ ఆఖరిలో..?

Stock Market New Benchmark: నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. భారీగా లాభాలు.. కానీ ఆఖరిలో..?
Advertisement

Stock Market New Benchmark: సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది.

సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్ సరికొత్త బెంచ్ మార్క్ ను అందుకుంది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డుల్ని నమోదు చేశాయి. S&P BSE సెన్సెక్స్ మొదటిసారిగా 76000 మార్క్ ను దాటింది. నిఫ్టీ 50 కూడా 500 పాయింట్లకు పైగా పెరిగి.. గరిష్ట స్థాయి 23,110.80కి చేరింది. మధ్యాహ్నం 1.26 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 495.85 పాయింట్లు పెరిగి 75,906.24 వద్ద, నిఫ్టీ 126.45 పాయింట్లు పెరిగి 23,083.55 వద్ద ఉన్నాయి.

Advertisement

ముంబై దలాల్ స్ట్రీట్ లోనూ మార్కెట్ సూచీలు లాభాలను చూశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ స్టాక్ లు భారీ లాభాలను అందించాయి. నిఫ్టీ 50లో దివీస్ లాబొరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ లు లాభాలు పొందిన వాటిలో టాప్ 5లో ఉన్నాయి. అలాగే విప్రో, గ్రాసిమ్, ఓఎన్ జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్ టాప్ లూజర్ల జాబితాలో ఉన్నాయి.

Also Read: జూన్ లో బ్యాంక్ సెలవుల లిస్ట్.. ఎన్నిరోజులో తెలుసా ?

Advertisement

ఒక్కసారిగా కొత్తరికార్డులతో మదుపరులకు లాభాలతో ఆశలు చూపించిన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. 600 మేర లాభపడిన సెన్సెక్స్.. అమ్మకాల ఒత్తిడి పెరగడంతో.. వచ్చిన లాభాలన్నింటినీ కోల్పోయింది. దీంతో సెన్సెక్స్ ఫ్లాట్ గా ముగిసింది. నిఫ్టీ మాత్రం 22,900కి పైనే ముగిసింది.

కేంద్రంలో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న వార్తలు స్టాక్ మార్కెట్లను లాభాల బాటపట్టించాయి. జూన్ 4 ఫలితాల తర్వాత బీజేపీ దేశంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుందంటూ యూబీఎస్ అంచనా వేసింది. ఒకవేళ బీజేపీ 250 కంటే తక్కువ సీట్లు సాధిస్తే.. ఇన్వెస్టర్లు 10-20 శాతం నష్టపోయే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×