E-Paper
Advertisement

SBI mCash: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఇలా డబ్బు పంపలేరు

SBI mCash: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఇలా డబ్బు పంపలేరు
Advertisement

SBI mCash: ఎస్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ ఆన్ లైన్, యోనో లైట్‌లలో mCASH సేవను నిలిపివేస్తుంది. కస్టమర్‌లు ఇకపై mCASH ఆప్షన్ ఉపయోగించి డబ్బు పంపలేరని పేర్కొంది. ఇకపై అన్ని నగదు బదిలీల కోసం UPI, IMPS, NEFT, RTGS సేవలను మాత్రమే ఉపయోగించాలని SBI వినియోగదారులను కోరింది. డిజిటల్ చెల్లింపులకు ఇవి సురక్షితమైనవని పేర్కొంది.

ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో చేసిన ప్రకటన మేరకు ఇకపై థర్డ్ పార్టీ లబ్ధిదారులకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడానికి యూపీఐ, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఇతర సురక్షితమైన, విస్తృతమైన సేవలను ఉపయోగించాలని కస్టమర్‌లను కోరింది. నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ, యోనో లైట్‌లో mCASH ద్వారా డబ్బు పంపడం, క్లెయిమ్ చేసే సౌకర్యం అందుబాటులో ఉండదని ఎస్బీఐ పేర్కొంది.

కస్టమర్లు mCashను ఎలా ఉపయోగించేవారు

Advertisement

గూగుల్ ప్లే స్టోర్ నుంచి SBI mCash అప్లికేషన్‌ ను డౌన్ లోడ్ చేసుకుని, లాగిన్ అవ్వడానికి MPINను ఉపయోగించాలి.

mCash కార్యాచరణ ఏంటి?

స్టేట్ బ్యాంక్ కస్టమర్ పాస్‌కోడ్ ఉపయోగించి పంపిన డబ్బులను.. ఇతర ఏ బ్యాంకు ఖాతాకైనా బదిలీ చేసుకోవచ్చు. కస్టమర్లు ఫండ్ ట్రాన్స్ పర్స్ కోసం అకౌంట్ నంబర్, IFSC కోడ్‌ను సెట్ చేసుకోవచ్చు.

mCash ఎలా పనిచేసేది?

Advertisement

ఎస్బీఐ mCASH, కస్టమర్లు ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ లేదా యోనో బ్యాంకింగ్ ద్వారా పంపిన డబ్బును క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడేది. ఇందులో అకౌంట్ ను సేవ్ చేయవలసిన అవసరం లేకుండానే కేవలం రిసీవర్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించడం ట్రాన్స్ ఫర్ అవకాశం కల్పించేవారు. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా స్టేట్ బ్యాంక్ mCASH యాప్ ద్వారా లేదా ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ లింక్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. లబ్ధిదారుడు 8-అంకెల పాస్‌కోడ్‌తో పాటు లింక్‌ను కలిగి ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌ ద్వారా పొందుతారు.

యూపీఐతో నగదు బదిలీ ఎలా?

mCash కస్టమర్లు ఎస్బీఐ యూపీఐని ఉపయోగించి నగదు లావాదేవీలు చేయవచ్చు. BHIM SBI Pay ద్వారా యూపీఐలో అన్ని బ్యాంకుల ఖాతాదారులు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, షాపింగ్ మొదలైన డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చు.

Also Read: EPFO Insurance: ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×