E-Paper
Advertisement

ATM Charges Hike: SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏటీఎం ఛార్జీలపై అన్ని వైపులా బాదుడు

ATM Charges Hike: SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏటీఎం ఛార్జీలపై అన్ని వైపులా బాదుడు
Advertisement

ATM Charges Hike: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ట్రాన్సాక్షన్ ఛార్జీలను పెంచింది. ఇంటర్ ఛేంజ్ ఫీజ్ పెరిగిన నేపథ్యంలో పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. కొత్త ఛార్జీలు గతేడాది డిసెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఏడాది కాలంలో రెండుసార్లు ఛార్జీల మోత మోగించింది ఎస్బీఐ. గతేడాది ఫిబ్రవరిలో ఇదే విధంగా ఛార్జీలు పెంచింది. 

SBI ఖాతాదారులకు బిగ్ అలర్ట్

Advertisement

ATM ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇతర బ్యాంక్ ATM ల్లో ట్రాన్సాక్షన్ల సంఖ్య నెలకు ఐదు కంటే ఎక్కువగా వినియోగిస్తే ఛార్జీల వడ్డన మొదలుకానుంది. ఆపై ప్రతీ విత్ డ్రాకు రూ. 23 లతోపాటు జీఎస్టీ కూడా వసూలు చేయనుంది. బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా 11 రూపాయలు అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది.

అలాగే సాలరీ ఖాతాదారులకు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం అందిస్తుంది. ఛార్జీలపెంపు ప్రభావం ఉచిత లావాదేవీ పరిమితిని మించి చేసినవారిపై ప్రభావం చూపనుంది. అలాగే ఎస్‌బీఐయేతర ఏటీఎంలను ఉపయోగించేవారు, సాలరీ ఖాతాదారులపై ప్రభావం చూపుతాయి. ఇతర కేటగిరీల అకౌంట్లకు ఈ సవరణల నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

Advertisement

ఏటీఎం ఛార్జీలపై అన్ని వైపులా బాదుడు

సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు ఐదు ఉచిత లావాదేవీలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ పరిమితి దాటితే కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ సాలరీ బ్యాంక్ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో నెలకు 10 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. గతంలో వీరికి అపరిమితంగా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చేసుకోవచ్చు.. కాకుంటే ఛార్జీల భారం తప్పదు.

ఈ సవరణల వల్ల ఖాతాదారులకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు, ప్రస్తుత ఛార్జ్ నిర్మాణం కొనసాగుతుందని పేర్కొంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా ఎస్‌బీఐ ఏటీఎంల్లో చేసే లావాదేవీలు పూర్తిగా ఉచితమని ప్రస్తావించింది. ఎస్‌బీఐ ఏటీఎంల్లో కార్డు రహిత నగదు ఉపసంహరణలు అపరిమితం, ఉచితంగా కొనసాగుతాయి.

ALSO READ:  అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

కిసాన్ క్రెడిట్ కార్డు-కేకేసీ ఖాతాలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంది. కస్టమర్లు అదనపు ఛార్జీల నుంచి తప్పించుకోవడం ఎలా? అందుకు ఉపాయం లేకపోలేదు. SBI కి దేశవ్యాప్తంగా 63 వేల పైచిలుకు ATMలు ఉన్నాయి. వాటి నుంచి లావాదేవీలు చేస్తే ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

నెల వారీ ఉచిత లావాదేవీ పరిమితి, బ్యాలెన్స్ చెకింగ్ లను తగ్గించుకోండి. బ్యాలెన్స్ తనిఖీల కోసం నెట్ బ్యాంకింగ్ లేదా UPI వంటి డిజిటల్ బ్యాంకింగ్‌, YONO లను ఉపయోగించండి. SBI కాని ATMలపై ఆధారపడే ఖాతాదారులు ఉపసంహరణలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగైతే పెరిగిన ఛార్జీల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×