E-Paper
Advertisement

Royal Enfield Bobber 350: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?

Royal Enfield Bobber 350: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 350 సీసీ బైక్.. ధర రూ. 2లక్షలు.. లాంచ్ ఎప్పుడంటే?
Advertisement

Bobber 350 form Royal Enfield: టూవీలర్ మేకర్ రాయల్ ఎన్ఫీల్డ్ దాని విభాగంలో నంబర్ వన్‌గా ఉంది. కంపెనీ దాని స్థానాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. ఇందులో 250 సీసీ బైకలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా, కంపెనీ క్లాసిక్ 350 బాబర్‌ను టెస్ట్ చేస్తోంది. ఇది చూడటానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లాగా కనిపిస్తుంది. అయితే ఇది స్ట్రిప్ డౌన్ రూపంలో ఉంది. ఇందులో రైడింగ్ పొజిషన్ బాబర్ బైక్‌ లుక్‌ని ఇస్తోంది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బాబర్‌ని టెస్ట్ చేస్తున్న ఫోటోలు, డిజైన్ బయటకు వెల్లడయ్యాయి. ఇందులో బైక్‌ను పెద్ద ఇంధన ట్యాంక్‌తో కనిపిస్తుంది. ఫోర్క్ కవర్, ఫ్రంట్, బ్యాక్ రొటేట్ ఫెండర్లు కనిపిస్తాయి. దీని ఛాసిస్, ఇతర ఫీచర్లు క్లాసిక్ 350 మాదిరిగానే ఉంటాయి. అయితే ఫ్లాట్ హ్యాంగర్ హ్యాండిల్‌బార్, స్టాండర్డ్ ట్రిమ్‌లో రైడింగ్ కోసం సింగిల్ పీస్ ఉంటుంది. ఇది చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తుంది. ఇది రిమూవ్ చేయవచ్చు. అందుకోసం పిలియన్ సీటు అందుబాటులో ఉంది.

Advertisement

రాయల్ ఎన్ఫీల్డ్ బాబార్ 350 ఇంజన్ గురించి మాట్లాడితే ఇది 349 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 6,100 ఆర్‌పీఎమ్ వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్ రిలీజ్ చేస్తుంది. 4,000 ఆర్పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్ ఉంది. బ్రేకింగ్ కోసం ముందు, వెనక టైర్లకు డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇది ఈ ఏడాది చివరినాటి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2 లక్షలుగా ఉండొచ్చు.

Also Read: Anant Ambani Wedding Car: అనంత్ అంబానీ పెళ్లి కారు అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా?

Advertisement

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొన్నేళ్లుగా 250 సీసీ బైకులపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ బైకులను V ఫ్లాట్‌ఫామ్‌పై తీసుకొస్తుంది. ఈ ఫ్లాట్‌ఫామ్‌పై తీసుకురావడానికి ముఖ్య కారణం ఖర్చులను తగ్గించడమే. ఇవి మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇది కొత్త లిక్విడ్-కూల్డ్ షెర్పా 450కి బదులుగా టెక్నీకల్లీ 350cc ఎయిర్-కూల్డ్ మోటార్‌తో ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ కొత్త 250సీసీ ఇంజన్‌తో హైబ్రిడ్ వేరియంట్‌లో రావొచ్చు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×