E-Paper
Advertisement

Reliance Meta AI Venture: ఫేస్ బుక్ తో కలిసి రిలయన్స్ ఏఐ వెంచర్.. రూ.855 కోట్ల పెట్టుబడులు

Reliance Meta AI Venture: ఫేస్ బుక్ తో కలిసి రిలయన్స్ ఏఐ వెంచర్.. రూ.855 కోట్ల పెట్టుబడులు
Advertisement

Reliance Meta AI Venture: రిలయన్స్ సంస్థ ఏఐ సేవలపై దృష్టి పెట్టింది. భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను అభివృద్ధి చేయడానికి మెటా ప్లాట్‌ఫామ్స్, ఫేస్‌బుక్ ఓవర్సీస్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

మెటాతో జాయింట్ వెంచర్

రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఏఐ వెంచర్ లో రూ.10 విలువ చేసే 2 మిలియన్ ఈక్విటీ షేర్లకు స్టార్టింగ్ సబ్‌స్క్రిప్షన్‌గా రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టింది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ కంపెనీ రిలయన్స్ అనుబంధ సంస్థగా పనిచేస్తుందని తొలుత పేర్కొంది. అయితే మెటాతో జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడంతో జాయింట్ వెంచర్ సంస్థగా మారింది.

రూ.855 కోట్ల పెట్టుబడి

Advertisement

ఏఐ జాయింట్ వెంచర్ లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ 70 శాతం వాటాను కలిగి ఉండగా, మిగిలిన 30 శాతం వాటాను ఫేస్‌బుక్ కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం రెండు కంపెనీలు సుమారు రూ.855 కోట్ల పెట్టుబడిని పెట్టాయి. అయితే ఈ లావాదేవీలు పార్టీ లావాదేవీల పరిధిలోకి రాదని, రిలయన్స్ కంపెనీ ప్రమోటర్/ప్రమోటర్ గ్రూప్/గ్రూప్ కంపెనీలలో ఎవరికీ ఈ లావాదేవీలో సంబంధం లేదని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ రిలయన్స్ పేర్కొంది.

Also Read: LIC Denies Allegations: అదానీ సంస్థల్లో పెట్టుబడులు.. ప్రభుత్వ ఒత్తిళ్లపై క్లారిటీ ఇచ్చిన ఎల్ఐసీ

ఏఐ సర్వీసుల అభివృద్ధికి

Advertisement

ఈ జాయింట్ వెంచర్ ఎంటర్‌ప్రైజ్ AI సొల్యూషన్స్‌పై దృష్టి సారించిందని రిలయన్స్ పేర్కొంది. నెక్ట్స్ జనరేషన్ డిజిటల్ టెక్నాలజీలపై రిలయన్స్ ఇంటెలిజెన్స్ పరిశోధన చేస్తుందని తెలిపింది. ఏఐ ఇంటెలిజెన్స్‌ అనేది ఎంటర్‌ప్రైజెస్‌ ఏఐ సర్వీసులను అభివృద్ధి, మార్కెట్‌, డిస్ట్రిబ్యూషన్‌ ను చేపట్టనుంది. రిలయన్స్, ఫేస్ బుక్ జేవీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గానీ, నియత్రణ సంస్థల నుంచి గానీ ఎలాంటి అనుమతులు అక్కర్లేదని రిలయన్స్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×