E-Paper
Advertisement

యూపీఐ పేమెంట్స్ పై ఆర్బీఐ కొత్త రూల్.. రూ.10 వేలు పైగా ట్రాన్స్ ఫర్ కు గంట ఆగాల్సిందే!

యూపీఐ పేమెంట్స్ పై ఆర్బీఐ కొత్త రూల్..  రూ.10 వేలు పైగా ట్రాన్స్ ఫర్ కు గంట ఆగాల్సిందే!
Advertisement

UPI Cooling Period: యూపీఐ పేమెంట్స్ అంటే ఇన్ స్టెంట్ మనీ ట్రాన్స్ ఫర్. మనీ పంపిన క్షణాల్లో డబ్బులు అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతాయి. అయితే దీన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి డిజిటల్ మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ కొత్త రూల్ తీసుకొస్తుంది. UPI లేదా IMPS ద్వారా ఎవరికైనా రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని పంపితే అవతలి వ్యక్తికి చేరడానికి గంట సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై 2026 మే 8 వరకు ఆర్‌బీఐ సూచనలను ఆహ్వానించింది. ఆ తర్వాత మార్గదర్శకాలను జారీ చేసే అవకాశం ఉంది.

సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు

2026 నాటికి దేశంలో ఆన్‌లైన్ మోసాలు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్నాయని అంచనా. సైబర్ నేరాలకు అడ్డుకట్టవేసేందుకు ఆర్‌బీఐ కూలింగ్-ఆఫ్ పీరియడ్‌ను పరిశీలిస్తోంది. దీని ప్రకారం, లావాదేవీలను ఒక గంట పాటు నిలిపివేస్తుంది. మనీ ట్రాన్స్ ఫర్ చేసినా.. అవతలి వ్యక్తికి గంట పాటు ఆ డబ్బు జమ అవ్వదు. ఈ టైమ్ లో మనీ పంపిన వ్యక్తి.. రిసీవర్ ను వెరిఫై చేసుకోవచ్చు. ఏదైనా మోసం జరిగినట్లు అనుమానం వస్తే మనీ ట్రాన్స్ ఫర్ ను రద్దు చేయవచ్చు. దేశంలో రూ. 10,000 పైబడిన లావాదేవీలు 45 శాతం అంటే మొత్తం విలువలో 98.5 శాతంగా ఉన్నాయి.

గంట కూలింగ్ పీరియడ్

Advertisement

సైబర్ నేరాలు చాలా వరకు బాధితులపై ఒత్తిడి తెచ్చి, వాళ్లు స్పందించడానికి సమయం లేకుండా చేసి డబ్బు కాజేస్తున్నారు. అందుకే ఒక గంట కూలింగ్ పీరియడ్ ఇస్తే బాధితులు ఆలోచించుకునే టైమ్ ఉంటుంది. అయితే ఈ కూలింగ్ పీరియడ్ అందరికీ వర్తించదు. తమకు తెలిసిన వ్యక్తులకు వెంటనే డబ్బులు పంపేందుకు కస్టమర్లను వైట్‌లిస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల వారికి డబ్బు పంపడానికి ఎలాంటి ఆలస్యం జరగదు. అలాగే ఈ రూల్ దుకాణాలలో చెల్లింపులు, ఇ-మాండేట్‌లు, చెక్కులు, NACH లావాదేవీలకు వర్తించదు.

ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలేంటంటే?

  • రూ. 10,000 దాటిన ట్రాన్జాక్షన్స్ ఒక గంట పాటు నిలిపివేస్తారు. ఈ సమయంలో కస్టమర్ లావాదేవీని రద్దు చేసుకోవచ్చు.
  • వయోవృద్ధులు అనగా 70 ఏళ్లు పైబడిన వారు, రూ. 50,000 కంటే ఎక్కువ మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి నమ్మకమైన వ్యక్తి అనుమతి తప్పనిసరి.
  • వ్యక్తిగత లేదా చిన్న వ్యాపారులు తన ఖాతాలలో డిపాజిట్లు రూ. 25 లక్షలు దాటితే, వెరిఫికేషన్ తర్వాతే బ్యాంకు డబ్బును జమ చేస్తుంది.
  • ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు.. యూపీఐ, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను ఒకేసారి నిలిపివేసేందుకు ‘కిల్ స్విచ్’ అనే బటన్‌ను కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోంది.

Also Read:  వావ్, రూ.వెయ్యి లోపు ‘ఫీచర్ ఫోన్లు’ చూశారా? UPI పేమెంట్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×