E-Paper
Advertisement

India Rupee: ఫలించిన ఆర్బీఐ జోక్యం.. తిరిగి పుంజుకున్న రూపాయి.. ఏడు నెలల్లో తొలిసారిగా

India Rupee:  ఫలించిన ఆర్బీఐ జోక్యం.. తిరిగి పుంజుకున్న రూపాయి.. ఏడు నెలల్లో తొలిసారిగా
Advertisement

India Rupee: ఇటీవల వరుసగా రూపాయి భారీ పతనాన్ని చూసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంది. దీంతో ఏడు నెలల్లో తొలిసారిగా రూపాయి బలపడింది. గత సెషన్‌లో రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి మారకం విలువ బుధవారం 1% వరకు పెరిగి 90.0963కి చేరుకుంది. స్థానిక మార్కెట్ లో డాలర్ జోరుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రేక్ వేసిందని విశ్లేషకులు తెలిపారు. మే 23 తర్వాత తొలిసారిగా రూపాయి తిరిగి పుంజుకుందని చెప్పారు.

ఆర్బీఐ సంకేతాలతో

గత కొన్ని వారాలుగా రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. దీంతో భారత కరెన్సీకి మద్దతుగా ఆర్‌బీఐ చర్యలు తీసుకోవాలని సర్వత్రా చర్చ జరిగింది. మంగళవారం విదేశీ మారకం విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం ఉందని వ్యాపారులు భావించారు.

Advertisement

“రూపాయి వేగంగా పతనం అవ్వడంతో..ఆర్బీఐ కల్పించుకుని డాలర్ దూకుడుగా కళ్లెం వేసిందని” అని కరూర్ వైశ్యా బ్యాంక్ ట్రెజరీ హెడ్ వీఆర్సీ రెడ్డి అన్నారు. మంగళవారం రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 91.0837 తాకిన తర్వాత, బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.7% పెరిగి 90.3775 వద్ద ముగిసింది. రూపాయికి వ్యతిరేకంగా ఊహాగానాలు పెరుగుతుండడంతో.. ఆర్బీఐ చర్యలు చేపట్టింది. కేంద్ర బ్యాంకు సంకేతాలతో రూపాయి దాదాపు 1% లాభపడింది.

వాణిజ్య ఒప్పందం ఆలస్యంతో

అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో స్థానిక స్టాక్‌లు, బాండ్లలో విదేశీ పెట్టుబడుల సెంటిమెంట్‌ దెబ్బతింది. దీంతో రూపాయి మారకం విలువ దాదాపు 2% తగ్గింది. ఈ సంవత్సరం స్థానిక ఈక్విటీల నుంచి విదేశీ ముదుపుదారులు సుమారు 18 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నాయి. ఈ ఉపసంహరణలతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అయితే 50% యూఎస్ సుంకాలు రూపాయి క్షీణతకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×