E-Paper
Advertisement

రూపాయి పతనం.. అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు, స్వాప్‌తో అడ్డుకట్ట

రూపాయి పతనం.. అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు, స్వాప్‌తో అడ్డుకట్ట
Advertisement

Mumbai: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఇంధన కొరతతో చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. ఈ క్రమంలో డాలర్ విలువ భారీగా పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు పతనం అవుతున్నాయి. ఈ నేపత్యంలో రూపాయి విలువ అదే స్థాయిలో పడిపోతోంది. పరిస్థితి గమనించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బై, సెల్ స్వాప్ చేపట్టాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి మే 26న ఈ-వేలం చేపట్టనుంది.

రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ చర్యలు

Advertisement

అంతర్జాతీయ పరిణమాల నేపథ్యంలో మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకూ పడిపోతోంది. గడిచిన నెల రోజులుగా పరిస్థితులను గమనించిన ఆర్బీఐ.. ఈ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లక్ష్యతను పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్-రూపాయి బై, సెల్ స్వాప్ వేలం నిర్వహిస్తామని తెలియజేసింది.

ఇంతకీ ఈ స్వాప్ అంటే ఏంటి? మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు బై లేదా సెల్ స్వాప్ విధానాన్ని ఫాలో అవుతుంది. దీని ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ వద్దనున్న డాలర్లను రిజర్వ్ బ్యాంక్‌కు విక్రయిస్తాయి. దానికి సమానమైన రూపాయిని పొందుతాయి.

Advertisement

మే 26న బై, సెల్ స్వాప్ వేలం

మూడేళ్ల గడువు ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను నిర్దేశించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ పద్దతి వల్ల బ్యాంకుల వద్ద రూపాయి లభ్యత పెరుగుతుంది. అంతేకాదు దేశీయంగా విదేశీ మారక నిల్వలు బలోపేతం అవుతాయి. దీనివల్ల బ్యాంకింగ్ వద్ద నగదు కొరత సమస్య ఉండదు.

అంతేకాదు బాండ్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ స్వాప్ వల్ల ద్రవ్య లభ్యత మెరుగుపడుతుంది. ప్రభుత్వానికి-పరిశ్రమలకు తక్కువ వడ్డీకే అప్పులు ఇవ్వవచ్చు. హెడ్జింగ్ ఖర్చులు తగ్గడం వల్ల వ్యాపారాలకు, దిగుమతులు చేసుకునే కంపెనీలకు ఊరట ఇవ్వనుంది. బై, సెల్ స్వాప్ పద్దతి ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి వీలవుతుంది.

ALSO READ: మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్.. బొక్కబోర్ల పడ్డ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లో విచిత్ర ఘటన!

ప్రస్తుతం రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఇది 100 రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరింతగా పడిపోకుండా ఈ స్వాప్ విధానం సహాయపడుతుందని భావిస్తున్నాయి. కనీస బిడ్ సైజ్ 10 మిలియన్ డాలర్లుగా పేర్కొంది ఆర్బీఐ. మార్కెట్లో డాలర్ తో పోల్చితే రూపాయి విలువ రూ.96.70 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×