E-Paper
Advertisement

RBI: ఆర్బీఐ తీపి కబురు.. వడ్డీ రేట్లు 25 పాయింట్లు తగ్గింపు, రూపాయి పతనం నేపథ్యంలో

RBI: ఆర్బీఐ తీపి కబురు.. వడ్డీ రేట్లు 25  పాయింట్లు తగ్గింపు, రూపాయి పతనం నేపథ్యంలో
Advertisement

RBI: మార్కెట్లో రోజు రోజుకూ రూపాయి పతనం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అమెరికా ఫెడ్ నిర్ణయాలు భారత్ పై మాత్రం పడకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్‌బీఐ. కీలక వడ్డీరేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ తగ్గింపుతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది.

ఆర్బీఐ తీపి కబురు చెప్పింది

Advertisement

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్‌బీఐ.వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా. తాజాగా రెపో రేటు 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. దీంతో 5.25 శాతానికి రెపో రేటు చేరింది. మూడు రోజుల ఆర్బీఐ మానటరింగ్ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.

దేశ జీడీపీ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన విధంగా 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. రూపాయి విలువ పడిపోతున్నట్లు నేపథ్యంలో శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశం-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో డాలర్‌ తో పోల్చితే రూపాయి విలువ 90 రూపాయిల మార్కుని తాకింది.

Advertisement

వడ్డీ రేట్లు 25 పాయింట్లు తగ్గింపు

ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు నిఫ్టీ స్వల్ప తగ్గుదలతో 26,007 వద్ద ట్రేడ్​ అవుతోంది. అటు బీఎస్ఈ సెన్సెక్స్​ స్వల్ప నష్టంతో 85,219 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో బ్యాంకులు.. RBI నుంచి తక్కువ వడ్డీకి నిధులు పొందవచ్చు. దీని కారణంగా ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ముఖ్యంగా హోం, కార్లు, వ్యక్తిగత, విద్యా రుణాల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల EMI లు తగ్గే అవకాశం ఉంది. ఆర్‌బీఐ నిర్ణయం వల్ల వినియోగదారులు కొత్త వస్తువులు, ఇళ్లు నిర్మాణం, వాహనాలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు.

ALSO READ: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. డాలర్ తో పోల్చితే రూ.90కి చేరువలో

ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్‌బీఐ. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. జూన్‌ ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. ఇప్పుడు 25 పాయింట్లు తగ్గించింది. ఇంతవరకు బాగానే ఉంది. బ్యాంకులు మాత్రం వెంటనే తగ్గించలేదన్నది వినియోగదారుల మాట. బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×