E-Paper
Advertisement

RBI Coins: 50 పైసలు, వేర్వేరు డిజైన్ల నాణాలు చెల్లుతాయా?.. ఆర్బీఐ ఏం చెబుతోంది?

RBI Coins: 50 పైసలు, వేర్వేరు డిజైన్ల నాణాలు చెల్లుతాయా?.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
Advertisement

RBI Coins: దేశంలో కరెన్సీతో పాటు నాణేలు విరివిరిగా చలామణి అవుతుంటాయి. అయితే ఇటీవల ఎక్కువగా కరెన్సీ మాత్రమే వినిగిస్తున్నారు. నాణేలు వేర్వేరు డిజైన్లలో ఉండడంతో వీటి పట్ల ప్రజల కాస్త అపనమ్మకం కలుగుతోంది. ఈ విషయంపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఒకే విలువ కలిగిన వేర్వేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి, సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయని పేర్కొంది. నాణేల గురించి తప్పుదారి పట్టించే పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ సూచించింది. నాణేలను అన్ని బ్యాంకుల్లో ఎలాంటి సందేహం లేకుండా స్వీకరిస్తారని తెలిపింది.

ఆర్బీఐ అవగాహన వీడియో

కరెన్సీ, వివిధ అంశాలకు సంబంధించి వచ్చే పుకార్లపై ఆర్బీఐ పౌరులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా నాణేలపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు సందేశాలు పంపుతోంది. నాణేలపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను కూడా రూపొందించింది. నాణేలు వేర్వేరు డిజైన్లతో ఉన్నప్పటికీ అవన్నీ చలామణిలోనే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. అంతేకాదు 50 పైసలు, రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలన్నీ చట్టబద్ధమేనని తెలిపింది.

రూ.10 నాణేలపై అపోహలు

Advertisement

భవిష్యత్ లోనూ నాణేలు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారం లేదా పుకార్లు నమ్మొద్దని సూచించింది. వ్యాపారులకు కూడా సంకోచం లేకుండా పౌరుల నుంచి నాణేలను స్వీకరించాలని ఆర్‌బీఐ కోరింది. ముఖ్యంగా రూ.10 నాణేల గురించి గతంలో ఆర్‌బీఐ అవగాహన కల్పించింది. అయినప్పటికీ ఇంకా కొందరు వీటిని తీసుకొనేందుకు సంకోచిస్తున్నారు. అంతేకాదు 50 పైసల నాణెం ఇంకా చెల్లబాటవుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×