E-Paper
Advertisement

Digital Banking: డిజిటల్ బ్యాకింగ్.. జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు, అందుబాలోకి మరిన్ని సేవలు

Digital Banking: డిజిటల్ బ్యాకింగ్.. జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు,  అందుబాలోకి మరిన్ని సేవలు
Advertisement

Digital Banking: టెక్ యుగం నేపథ్యంలో బ్యాకింగ్ వ్యవస్థలో రకరకాల మార్పులు చేస్తోంది ఆర్బీఐ. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌-BSBD ఖాతాల సేవలు విస్తరించనుంది. ఈ నేపథ్యంలో జీరో బ్యాలెన్స్‌ ఖాతాలకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఆయా సేవలను ఖాతాదారులకు ఉచితంగా అందించనున్నాయి.

డిజిటల్ బ్యాకింగ్.. జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు

Advertisement

జీరో బ్యాలెన్స్ జీరో-ఫీ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా ఏ కస్టమర్ కోరితే ఉచిత సేవల అందించాలని పేర్కొంది రిజర్వ్ బ్యాంక్. సాధారణ పొదుపు సేవగా పరిగణించాలని ఆదేశించింది. బ్యాంకులకు కస్టమర్ల నుండి అభ్యర్థన వస్తే ప్రస్తుత ఖాతాలను BSBD ఖాతాలుగా మార్చాలని ఆదేశించింది. ఏ కస్టమర్ కనీస సగటు బ్యాలెన్స్‌ను నిర్వహించమని, జరిమానాలు చెల్లించమని అడగాల్సిన పని లేదు.

కస్టమర్ ప్రాధాన్యతను బట్టి 25 చెక్కు లీఫ్‌లు, వార్షిక ఛార్జీలు లేకుండా ఉచిత ATM/డెబిట్ కార్డ్, ఉచిత పాస్‌బుక్ లేదా ఇ-స్టేట్‌మెంట్‌లతో సహా నిర్వచించబడిన ఉచిత సౌకర్యాలను అందించనుంది. కస్టమర్లను ఎలాంటి అదనపు సేవలు లేదా ఆప్ట్-ఇన్‌ల కోసం ముఖ్యంగా చెక్ బుక్‌లు లేదా డెబిట్ కార్డుల కోసం బలవంతం చేయకూడదని RBI నొక్కి వక్కానించింది.

Advertisement

అందుబాలోకి మరిన్ని సేవలు

బీఎస్‌బీడీ ఖాతా ఉన్నవారు.. ఆ బ్యాంకులో మరో ఇతర పొదుపు ఖాతా తెరిచే అవకాశం ఉండదు. వినియోగదారుడు ఆ బ్యాంకులో ఏదైనా ఖాతా ఉంటే.. డిజిటల్ ఖాతా తెరిస్తే.. 30 రోజుల్లో ఆ ఖాతాను మూసివేయాలి.  కస్టమర్లు వార్షిక ఛార్జీలు లేకుండా ATM లేదా ATM-కమ్-డెబిట్ కార్డ్, ఏడాదికి కనీసం 25 లీవ్‌లతో చెక్ బుక్, ఉచితంగా ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ స్టేట్‌మెంట్, ఎలాంటి ఖర్చు లేకుండా పాస్‌బుక్‌ని పొందేందుకు అర్హులు.

నెలకు కనీసం నాలుగు ఉచిత ఉపసంహరణలు అనుమతించబడతాయి. PoS లావాదేవీలు, NEFT, RTGS, UPI, IMPSతో సహా డిజిటల్ చెల్లింపులు ఉపసంహరణ పరిమితిలో లెక్కించబడవు. దీనివల్ల గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ప్రజలు బ్యాంకులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని భావిస్తోంది.

ALSO READ: మహిళలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

BSBD ఖాతాలను 2012 లో ప్రవేశపెట్టింది. వీటిపై పెద్దగా ప్రజలకు అవగాహన లేకపోవడంతో బ్యాంకులు అటువైపు మొగ్గలేదు. కొంతమంది మందికి మాత్రమే వీటి గురించి తెలుసు. ఇప్పుడు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

కస్టమర్లు తమ ప్రస్తుత పొదుపు బ్యాంకు ఖాతాలను BSBD ఖాతాలుగా మార్చుకోవచ్చు. బ్యాంకులు అటువంటి అభ్యర్థనలను ఏడు రోజుల్లోపు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్గాల ద్వారా ఈ ఎంపికను ప్రారంభించాలి. కస్టమర్లు అన్ని బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ BSBD ఖాతాలను కలిగి ఉండటం నిషేధం. కొత్త BSBD ఖాతాను తెరవడానికి ముందు బ్యాంకుకు డిక్లరేషన్ ఇవ్వాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×