E-Paper
Advertisement

రూ.20 ప్రభుత్వ పథకంతో రూ.2 లక్షలు ప్రయోజనం.. ఎలా అప్లై చేయాలంటే?

రూ.20 ప్రభుత్వ పథకంతో రూ.2 లక్షలు ప్రయోజనం.. ఎలా అప్లై చేయాలంటే?
Advertisement

PMSBY Scheme: ఈ రూ.20 గవర్నమెంట్ స్కీమ్ తో 2 లక్షల ప్రయోజనం పొందవచ్చు. కేవలం రూ.20 లకే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ స్కీమ్ కు అర్హులు. ఏదైనా ప్రమాదంలో పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు ఇస్తారు. లేదా శాశ్వత వైకల్యం పొందితే రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తారు.

ఏడాదికి రూ.20

ప్రమాదంలో పాక్షికంగా వైకల్యం పొందితే లక్ష రూపాయల వరకు బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడం చాలా సులభం. మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులో సంప్రదిస్తే ఈ పాలసీ చేస్తారు. బ్యాంకు అకౌంట్ నుంచి రూ.20 కట్ చేసుకుని పాలసీని యాక్టివేట్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి రూ.20 చెల్లించి పాలసీని రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఆటో రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు ఈ పాలసీ చెల్లుబాటు అవుతుంది.

Advertisement

ఇప్పటి వరకూ ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే.. కనీసం రూ.20 పీఎంఎస్బీవై పాలసీ అయినా తీసుకోవాలని ఎక్స్ ఫర్ట్స్ సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మరో స్కీమ్.. పీఎం జీవన్ జ్యోతి యోజనలో ఏడాదికి 436 రూపాయలు చెల్లిస్తే.. ఏ కారణంగా మరణించిన రూ.2 లక్షల బీమా పొందవచ్చు.

Also Read:  మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. పూర్తి వివరాలు ఇలా!

క్లెయిమ్ ఎలా?

Advertisement

ప్రమాదం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు, బ్యాంకును సంప్రదించాలి. ప్రమాదానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అంటే FIR, డెత్ సర్టిఫికేట్ సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలి. ఆత్మహత్య వంటి ఇతర కారణాల వల్ల జరిగే మరణాలు ఈ పాలసీ పరిధిలోకి రావు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×