PM Vidyalaxmi Scheme: పేద విద్యార్థుల చదువుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల వరకు విద్యారుణాలు అందిస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంది. NIRF ర్యాంకింగ్ ఆధారంగా టాప్ 860 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్సిస్టిట్యూట్స్ లో అడ్మిషన్లు పొందిన మెరిట్ విద్యార్థులకు, ఎలాంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు విద్యా రుణాలను అందిస్తారు. నవంబర్ 6,2024న కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కోసం కేంద్రం 2024-25 నుంచి 2030-31 వరకు రూ.3,600 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ లో రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు రూ.7.5 లక్షల వరకు రుణాలపై 75% క్రెడిట్ గ్యారెంటీ, మారటోరియం సమయంలో 3% వడ్డీ రాయితీ అందిస్తారు. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. భారత్ లేదా విదేశాలలో ఉన్నత చదువుల కోసం విద్యా రుణాలు పొందేందుకు పీఎం విద్యా లక్ష్మి పోర్టల్ లో అప్లై చేసుకోవచ్చు. 37కు పైగా బ్యాంకులు ఈ స్కీమ్ ద్వారా రుణాలు అందిస్తున్నాయి. విద్యార్థులు మూడు బ్యాంకులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు.
1. దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి.
2. దేశంలోని టాప్ 860 విద్యాసంస్థలలో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు పొందాలి.
3. కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంటే 3% వడ్డీ రాయితీకి అర్హులు
4. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందితే.. ఇతర ప్రభుత్వ స్కాలర్‌షిప్ లు, సబ్సిడీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు
5. విద్యా రుణంపై సబ్సిడీ పొందేందుకు కోర్సు పూర్తిగా చదవాలి.
6. UG/PG/ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌కు ఒక్కసారి మాత్రమే లోన్ అప్లై చేసుకోవచ్చు.
7. NIRF ర్యాంకింగ్ టాప్ 100లోని ఉన్నత విద్యా సంస్థలు
8. NIRF టాప్ 200 లోని రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు
9. భారత ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు
1.ఆధార్ కార్డు
2.పాన్ కార్డు
3.అడ్రస్ ఫ్రూఫ్
4.గత విద్యకు సంబంధించిన మార్కు షీట్లు
5.అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్స్
5.జాయిన్ అయ్యే విద్యాసంస్థ నుంచి ఆఫర్ లెటర్
6. ఆదాయ ధృవీకరణ పత్రం
విద్యా లక్ష్మి పథకాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
1. పీఎం విద్యాలక్ష్మి అధికారిక వెబ్‌సైట్ పై క్లిక్ చేయండి.
2. హోమ్ పేజీలోని లాగిన్ పై క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, మొబైల్ నెంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
3. ఇ-మెయిల్‌కు పంపిన యాక్టివేషన్ లింక్ వెరిఫై చేయాలి.
4. వ్యక్తిగత, విద్య వివరాలు, కోర్సు, ఫ్యామిలీ ఇన్ కమ్ వివరాలు, బ్యాంకు అకౌంట్ వివరాలు నమోదు చేయాలి.
5. ఆధార్, పాన్, అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, ఇన్ కమ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
6. సబ్మిట్ కు ముందు అప్లికేషన్ ను ప్రివ్యూ చూసుకోవాలి.
7. విద్యా రుణానికి అప్లై చేసుకున్న తర్వాత 3 బ్యాంకులను సెలక్ట్ చేసుకోవాలి. డాష్‌బోర్డ్‌లో అప్‌డేట్‌లను ట్రాక్ చేయవచ్చు.
Also Read: ఆలస్యం చేస్తే మిస్.. EV కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్
1.విద్యా లక్ష్మి లోన్ కోసం మీ సమీపంలోని బ్యాంకును విజిట్ చేయండి.
2. బ్యాంకు అధికారులు ఇచ్చే ఎడ్యుకేషన్ లోన్ ఫామ్ లో వివరాలు నమోదు చేయండి.
3. ఐడెంటిటీ, అడ్రస్ ఫ్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, అడ్మిషన్ లెటర్, ఆదాయ రుజువుతో సహా అవసరమైన పత్రాలు అందించాలి.
4. బ్యాంకు అధికారులు అప్లికేషన్ ను పరిశీలించి, సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు.
5. వెరిఫికేషన్ తర్వాత అన్ని అర్హతలు కరెక్ట్ గా ఉంటే లోన్ మంజూరు చేస్తారు.