E-Paper
Advertisement

ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా? లక్షల్లో వడ్డీ!

ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న ఈ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసా? లక్షల్లో వడ్డీ!
Advertisement

PM Modi Invested: భారతీయులు వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేయడానికి ఇష్టపడతారు. అది ఇళ్లు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం కూడబెడుతుంటారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, రాజకీయ నేతలు, సీఎంలు, చివరకు ప్రధానమంత్రిగా పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడతారు. ఆయా పథకాలపై వడ్డీ అలాగే వస్తుంది. ఇంతకీ ప్రధాని నరేంద్రమోదీ పెట్టుబడులు పెడుతున్న పథకాలను ఒక్కసారి తెలుసుకుందాం.

ప్రధాని మోడి ఇన్వెస్ట్ చేస్తున్న పథకం- National Savings Certificate Scheme: పోస్ట్ ఆఫీసులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్-NSC. సరైన సమయంలో, సరైన చోట డబ్బును పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమైన విషయం. అవసరం నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇతరుల్ని అడగాల్సిన అవసరం ఉండదు.

Advertisement

వడ్డీతోపాటు చక్రవడ్డీ కూడా-కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీసు వారి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం చాలా ఉత్తమమైనది. అన్నింటి కన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ పథకంలో పెట్టుబడి పెడతారు. ఆ విషయం మీకు తెలుసా? కేవలం భద్రతకు మాత్రమే కాదు రాబడులను అందించడంలో కీలకమైనది.

భారత ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా నిర్వహించబడే పథకం. మార్కెట్ రిస్కుల నుండి విముక్తి పొందింది. మీరు కేవలం రూ. 1,000 తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తంపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు, సామాన్యులు కోరుకున్నంత పెట్టుబడి పెట్టవచ్చు.

Advertisement

నాలుగేళ్ల వరకు పన్ను మినహాయింపు-ఈ పథకం కింద వార్షిక వడ్డీ ఇస్తుంది. పెట్టుబడి మొత్తంపై సంపాదించిన వడ్డీ అదనంగా  చక్రవడ్డీ  7.7 శాతం వడ్డీ ఇస్తుంది. కాకపోతే దీనికి కొన్ని కండీషన్లు ఉన్నాయి. లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లు. ఈ పథకంలో ఐదేళ్లపాటు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి అంతా కలిపి రూ. 7,24,517 లభిస్తుంది. దాదాపు రూ. 2,24,517 రాబడి వస్తుందన్నమాట.

పొదుపు పథకం కింద పన్ను ప్రయోజనాలు ఇస్తుంది. పాత పన్ను విధానం ప్రకారం.. రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందుతారు. వచ్చిన వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది, కాబట్టి తొలి నాలుగేళ్లు సంపాదించిన వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది.

ALSO READ: పసిడి ప్రియులకు చల్లని వార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

ఐదో ఏడాది మెచ్యూరిటీ మొత్తంపై సంపాదించిన వడ్డీ మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోస్టాఫీసు ద్వారా జాతీయ పొదుపు సర్టిఫికెట్‌లో పెట్టుబడి పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో రూ. 7.61 లక్షలు పెట్టుబడి పెట్టగా ఇప్పుడు రూ.9.12 లక్షలకు పెరిగింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×