E-Paper
Advertisement

RBI: ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం.. ఆర్బీఐ కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో

RBI: ప్లాస్టిక్ నోట్ల వ్యవహారం.. ఆర్బీఐ కీలక ప్రకటన, రాబోయే రోజుల్లో
Advertisement

RBI: దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బిఐ పరిశీలిస్తోందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉందని తెలిపారు.ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

ప్లాస్టిక్ నోట్ల కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన

Advertisement

దేశ కరెన్సీ చరిత్రలో కీలకమైన మార్పునకు శ్రీకారం చుట్టే యోచనలో ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలన చేస్తున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు.

ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందన్నారు. ఇంకా ఎలాంటి తీసుకోలేదని వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచనను రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా పదేళ్ల కిందట ప్రతిపాదన చేసింది. కాగితపు కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చు, నోట్లు చేతులు మారే క్రమంలో పాడైపోవడం వంటివి దృష్టిలో ఉంచుకొని అప్పుడే ప్రతిపాదన చేసింది.

Advertisement

ప్రతిపాదన ప్రాథమిక దశలో ఉందని వెల్లడి

దేశవ్యాప్తంగా ట్రయల్ పద్ధతిలో రూ.10 విలువైన ఓ బిలియన్ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది. అందుకోసం కొన్ని నగరాలను ఎంపిక చేసింది. వాటిలో కొచ్చి, మైసూర్‌, జైపుర్‌, శిమ్లా వంటి ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుతానికి వచ్చేద్దాం.

మార్కెట్‌లో నకిలీ నోట్ల పెరగడంతో వాటిని అరికట్టేందుకు సిద్ధమవుతోంది ఆర్బీఐ. నోట్లలో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు, వార్నిష్డ్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాన్ని ప్రస్తావించింది కూడా. సాధారణ నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు రెండు లేదా మూడు రెట్లు అధిక కాలం మన్నుతాయని అంచనా వేస్తోంది.

ALSO READ: విప్రో వార్నింగ్.. వేధింపులు ఏ మాత్రం సహించం, పూణె విషయంలో 

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ మార్పు ఇప్పటికే మొదలైంది. ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలు పాలిమర్ కరెన్సీకి పూర్తిగా మారాయి. మరికొన్ని దేశాలు దీన్ని పాక్షికంగా స్వీకరించాయి. ఐనప్పటికీ దేశం, ప్రపంచంలోని చాలా దేశాలు కాగితపు నోట్లపైనే ఆధారపడి ఉన్నాయి. తాజాగా ఆర్‌బిఐ ఈ ప్రతిపాదనను మళ్లీ సమీక్షించడం మొదలుపెట్టింది. భారతదేశం కేవలం ఎక్కువ కరెన్సీని ముద్రించడం మాత్రమే కాదు, దాని మన్నికను పెంచడం, నిర్వహణ ఖర్చును తగ్గించడం ఎలా అనేది ముఖ్యం.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×