E-Paper
Advertisement

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త రూల్స్.. పెన్షన్ డబ్బులకు ఫుల్ గ్యారెంటీ, ఇంకెందుకు ఆ చింత

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కొత్త రూల్స్.. పెన్షన్ డబ్బులకు ఫుల్ గ్యారెంటీ, ఇంకెందుకు ఆ చింత
Advertisement

National Pension System: నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందదారులకు రక్షణ మరింత పెరిగేలా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ. ఆ నిబంధనల ప్రకారం పెన్షన్ ఫండ్‌లు థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా అందించే సేవలలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సదరు పెన్షన్ ఫండ్ చందదారులకు పూర్తి జవాబుదారీగా ఉంటుంది.

పెన్షన్ డబ్బులకు ఫుల్ గ్యారెంటీ-నేషనల్ పెన్షన్ సిస్టమ్-NPS ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడే దిశగా అడుగులు పడ్డాయి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ- PFRDA కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జులై 13 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పెన్షన్ ఫండ్‌లు తమ కార్యకలాపాల కోసం థర్డ్ పార్టీ లేకుంటే బయటి ఏజెన్సీని భాగస్వామిగా చేసుకుని అది చేసే లోపాలకు సదరు పెన్షన్ ఫండ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Advertisement

తాము వేరే సంస్థకు పనులు అప్పగించామని, మాకేం సంబంధం లేదని పెన్షన్ ఫండ్‌లు తప్పించుకోవడానికి వీల్లేదు. దీనిపై PFRDA న్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. సవరణ- 2026 ద్వారా కొత్తగా రెగ్యులేషన్ 4A ని తీసుకొచ్చింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA. పెన్షన్ ఫండ్‌లు నిర్దిష్ట ప్రయోజనాల కోసం రూపొందించే స్కీమ్‌ల నిర్వహణను అర్హత కలిగిన సంస్థలకు అప్పగించవచ్చు.

ఆ థర్డ్ పార్టీ సంస్థలు చేసే ప్రతి రకమైన లోపానికి పెన్షన్ ఫండ్ చందదారులకు పూర్తి జవాబుదారీగా ఉంటుంది. బయటి సంస్థలు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ- CRA, PFRDA పరిధిలోని ఇతర మధ్యవర్తులతో సమాచారాన్ని పంచుకోవడానికి, చెల్లింపులు సులభతరం చేయడానికి అవసరమైన సాంకేతిక సామర్థ్యాన్ని తప్పకుండా కలిగి ఉండాలి.

Advertisement

శాండ్‌బాక్స్ ఫ్రేమ్‌వర్క్- నోటిఫికేషన్‌లో PFRDA రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ఫ్రేమ్‌వర్క్-2026 ని ప్రకటించింది. పెన్షన్ రంగంలో కొత్త టెక్నాలజీ ఉత్పత్తులు, వ్యాపార నమూనాలు, సేవా విధానాలను ప్రయోగత్మకంగా పరీక్షించడానికి ఇదొక సురక్షిత వేదికలా పని చేయనుంది. నిబంధనలను సడలిస్తూనే చందదారుల నిధులకు ఎలాంటి సమస్య రాకుండా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని ఉద్దేశంగా చెబుతున్నారు.

ALSO READ: ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు.. 95 డాలర్లు పైనే, ఆయిల్ ధరలు పెరిగే ఛాన్స్

ఈ మార్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు. డిజిటల్ లేకుంటే థర్డ్ పార్టీ సేవల్లో సాంకేతిక లోపాలు తలెత్తితే చందదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు బాధ్యతను నేరుగా పెన్షన్ ఫండ్స్‌పై పెట్టడం వల్ల వారు నాణ్యమైన భాగస్వాములను ఎంచుకుంటారు. ఇది NPS వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచుతుందని ఫైనాన్స్ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×