E-Paper
Advertisement

Petrol Storage Rules: ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు? లిమిట్ దాటితే పడే శిక్షలు ఏంటి?

Petrol Storage Rules: ఇంట్లో ఎంత పెట్రోల్ నిల్వ చేయవచ్చు? లిమిట్ దాటితే పడే శిక్షలు ఏంటి?
Advertisement

Petrol Storage Rules: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో.. దేశంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై అనిశ్చితి ఏర్పడింది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చమురు కొరత లేదని చెబుతున్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి.. అసరానికి మించి ఇంధనం పోయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే ఓ ప్రశ్న ఉత్పత్తనమవుతోంది. అసలు సామాన్యులు ఇంట్లో పెట్రోల్ నిల్వ చేసుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఎన్ని లీటర్ల వరకూ పరిమితి? దానిని మించితే చట్టప్రకారం పడే శిక్షలు ఏంటీ? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

నిల్వ చేయెుచ్చా? లేదా?

భారతదేశంలో పెట్రోల్ నిల్వకు సంబంధించి పెట్రోలియం చట్టం 1934, పెట్రోలియం నిబంధనలు 2002 ప్రకారం కఠినమైన షరతులను విధించారు. వీటి ప్రకారం ఒక వ్యక్తి తన ఇంట్లో ఎటువంటి ప్రత్యేక లైసెన్స్ లేకుండా గరిష్టంగా 30 లీటర్ల వరకు మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్‌ను నిల్వ ఉంచుకోవచ్చు. అయితే దీనిని అమ్మడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం అనుమతించదు. కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ లేదా డీజిల్ ను నిల్వ చేసే డబ్బాలపై కూడా ఈ చట్టంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. పెట్రోల్‌ను నిల్వ చేసే డబ్బాలు, మెటల్ లోహాలను మాత్రమే స్టోరేజ్ కోసం వినియోగించాల్సి ఉంటుంది. సాధారణ నీళ్ల బాటిళ్లలో లేదా పలచని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయడం చట్టరిత్యా నేరం.

పరిమితి దాటితే జరిగేది ఇదే?

Advertisement

ఒక వ్యక్తి తన 30 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ లేదా డీజిల్ నిల్వ ఉంచినట్లు గుర్తిస్తే.. పెట్రోలియం చట్టాల ప్రకారం అతడు నేరం చేసినట్లుగా నిర్దారిస్తారు. మెుదటిసారి తప్పుచేసి పట్టుబడితే నెల వరకూ సాధారణ జైలు లేదా రూ.1000 జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ అమలు చేయవచ్చు. మళ్లీ రెండోసారి కూడా అదే తప్పుచేసి పట్టుబడితే ఈసారి 3 నెలల జైలు లేదా రూ.5000 జరిమాన.. లేదంటే రెండూ విధించొచ్చు. అనంతరం అతడి వద్ద నిబంధనలకు విరుద్దంగా ఉన్న పెట్రోల్ ను అధికారులు సీజ్ చేస్తారు.

30 లీటర్ల కంటే ఎక్కువ కావాలంటే?

ఒక మనిషి 30 లీటర్ల కంటే ఎక్కువ అంటే దాదాపు 300 లీటర్ల వరకూ పెట్రోల్ ను నిల్వ చేసుకునేందుకు కూడా పెట్రోలియం చట్టాలు అనుమతిస్తున్నాయి. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించాయి. భారీ మెుత్తంలో పెట్రోల్ నిల్వ చేయాలని భావిస్తే ముందుగా స్థానిక జిల్లా అధికారులు లేదా పెసో (Petroleum and Explosives Safety Organization – PESO) నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి.

Advertisement

Also Read: Washing Machine Tips: బట్టలు ఉతికిన తర్వాత.. వాషింగ్ మిషన్ డోర్.. తెరిచి ఉంచాలా? మూసివేయాలా?

భద్రతాపరమైన జాగ్రత్తలు..

ఒకవేళ 30-300 లీటర్ల వరకూ పెట్రోల్ నిల్వ చేయాలని భావిస్తే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వంటగదితో పాటు అగ్నికి దూరంగా ఉంచాలని.. ఎట్టిపరిస్థితుల్లో పెట్రోల్ నిల్వ ఉంచి పరిసరాల్లో పొగత్రాగరాదని తెలియజేస్తున్నారు. గాలి బాగా ఆడే ప్రదేశంలో పెట్రోల్ ను ఉంచితే మంచిదని సూచిస్తున్నారు.

ముఖ్యగమనిక: ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి భయంతో ఎక్కువ పెట్రోల్ ను ఇంట్లో నిల్వ చేసుకొని కుటుంబ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దు. మీ అవసరానికి మాత్రమే పెట్రోల్ కొనుగోలు చేసి.. కృత్రిమ ఇంధన కొరత జరగకుండా మీ వంతు బాధ్యత వహించండి.

Also Read: Klynk Smart Cooktop: దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఇండక్షన్ స్టవ్.. వంట రాకున్నా.. మిమ్మల్ని గైడ్ చేసి మరి వండేస్తది!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×