E-Paper
Advertisement

పెళ్లి ఖర్చులకు పర్సనల్ లోన్.. ఈ విషయాలు తెలుసుకోండి?

పెళ్లి ఖర్చులకు పర్సనల్ లోన్.. ఈ విషయాలు తెలుసుకోండి?
Advertisement

Wedding Loan: పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. తెలుగిళ్లలో పెళ్లి తంతు అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ, థీమ్స్, గిఫ్ట్స్ ఇలా ఎన్నో ఆడంబరాలతో వివాహ వేడుక చేసుకుంటున్నారు. పెళ్లి ఖర్చులకు చాలా మంది లోన్ పై ఆధారపడుతున్నారు. అందుకే పెళ్లి ఖ‌ర్చుల‌కు కూడా కొన్ని బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. మరి పెళ్లి కోసం పర్సనల్‌ లోన్‌ తీసుకోవడం సరైన నిర్ణయమేనా? దాని వల్ల ఉన్న ప్రయోజనాలేంటీ, ఇబ్బందులేంటీ? పెళ్లి వేడుక కోసం తీసుకునే లోన్లు పర్సనల్ లోన్ కిందకే వస్తాయి. బ్యాంక్‌లో అకౌంట్, క్రెడిట్ కార్డు వాడకం, ఇన్ కమ్, తిరిగి చెల్లించే సామర్థ్యం, సిబిల్ స్కోర్.. ఆధారంగా బ్యాంకులు లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. వడ్డీ రేటు కూడా వీటి పైనే ఆధారపడి ఉంటుంది. ఈ లోన్ ను ఎలా ఖర్చు చేస్తున్నారనే దానిపై మాత్రం బ్యాంకులు ఎలాంటి లిమిట్ పెట్టవు.

తక్కువ టైంలోనే లోన్ గ్రాంట్

వివాహ ఖర్చుల కోసం పర్సనల్ లోన్ ఈజీగా పొందొచ్చు. లిమిటెడ్ డాక్యుమెంట్స్ తో కేవలం 24 నుంచి 72 గంటల్లోనే లోన్ అమౌంట్ మన ఖాతాలోకి చేరుతాయి. లోన్ తీసుకోవడానికి ప్రాపర్టీ, గోల్డ్ లాంటివి తాకట్టు పెట్టాల్సిన అవ‌స‌రం లేదు. మన ఇన్ కమ్, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా లోన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. లోన్ తిరికి చెల్లించే సామ‌ర్థ్యం, ఆర్థిక పరిస్థితిని బ‌ట్టి లోన్ కట్టే టైమ్ పీరియడ్ ను ఎంచుకోవచ్చు. సాధారణంగా ఇది 12 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఖాళీ అవ్వకుండా తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ లోన్ అమౌంట్ వాడుకోవచ్చు.

ఇబ్బందులు ఉన్నాయ్

Advertisement

ఈ తరహా లోన్లతో తాత్కాలికంగా అవసరాలు తీరుతున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పెళ్లి వేడుక ఒక వారంలో పూర్తయిపోతుంది కానీ దానికోసం తీసుకున్న రుణాన్ని మాత్రం ఏళ్ల పాటు ఈఎంఐ రూపంలో కట్టాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులకు పోయి ఆర్థిక ఒత్తిడి తెచ్చుకోవడం అవసరమా? అనే విషయాన్ని లోన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి.
సాధారణంగా ఇతర లోన్లతో పోలిస్తే పర్సనల్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్‌ స్కోరును బట్టి పలు బ్యాంకులు 10 శాతం నుంచి 24శాతం వరకు వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎక్కువ వడ్డీతో తిరిగి చెల్లించే మొత్తం భారీగా ఉంటుంది.

ఒక్కోసారి ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే క్రెడిట్‌ స్కోరుపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో భవిష్యత్తులో లోన్ తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఈజీగా లోన్ దొరుకుతుందని మన బడ్జెట్‌కు మించి ఖర్చు చేస్తే పెళ్లి తర్వాత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. లోన్ కోసం అప్లై చేసే ముందు రుణ సంస్థల వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటే బెటర్.

Advertisement

Also Read: ఆర్బీఐ కొత్త గోల్డ్ లోన్ రూల్స్.. ఇక తక్కువ బంగారంపై ఎక్కువ లోన్ పొందవచ్చు

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×