E-Paper
Advertisement

PAN Card  Number: మీ పాన్ కార్డ్ నంబర్ వెనక ఇంత అర్థం ఉందా? ఆ 10 అక్షరాల గుట్టు ఇదే !

PAN Card  Number: మీ పాన్ కార్డ్ నంబర్ వెనక ఇంత అర్థం ఉందా? ఆ 10 అక్షరాల గుట్టు ఇదే !
Advertisement

PAN Card  Number: పాన్ కార్డ్ (PAN Card) ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే పది అంకెల గుర్తింపు కార్డు మాత్రమే కాదు. ఇందులో మీ ఆర్థిక విషయాలకు సంబంధించిన కీలక సమాచారం దాగి ఉంటుంది. మీ పేరులోని మొదటి అక్షరం నుంచి, మీరు వ్యక్తా లేక సంస్థా అనే వివరాల వరకు అన్నీ ఈ పది అక్షరాలలోనే నిక్షిప్తమై ఉంటాయి. ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డ్ (Permanent Account Number) తప్పనిసరిగా మారింది. ఇది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ (అక్షరాలు, అంకెలు కలిసిన) కోడ్. చాలా మంది ఇది ఏదో రాండమ్ నంబర్ అనుకుంటారు. కానీ దీనిలోని ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఇంతకీ ఈ నంబర్లు ఎలా కేటాయిస్తారు. అందులోని ప్రతి అక్షరం వెనక ఉన్న ఆసక్తికరమైన అర్థం ఏంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. మొదటి మూడు అక్షరాలు (AAA to ZZZ):

పాన్ కార్డులోని మొదటి మూడు అక్షరాలు కేవలం వర్ణమాల క్రమంలో ఉంటాయి. అంటే ‘AAA’ నుంచి ‘ZZZ’ వరకు ఏదైనా మూడు అక్షరాలు ఉంటాయి. ఇవి ఆదాయపు పన్ను శాఖ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా కేటాయించబడతాయి.

Advertisement

2. నాలుగో అక్షరం: అత్యంత కీలకం:

పాన్ కార్డులో నాలుగో అక్షరం మీ హోదాను (Status) సూచిస్తుంది.

P (Individual): మీరు ఒక సామాన్య వ్యక్తి అయితే ‘P’ ఉంటుంది. (P అంటే Person).

C (Company): ప్రైవేట్ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు.

H (HUF): హిందూ అవిభక్త కుటుంబం కోసం.

F (Firm): పార్టనర్‌షిప్ ఫర్మ్‌ల కోసం.

T (Trust): ట్రస్టుల కోసం.

A (AOP): సంఘాల కోసం.

3. ఐదో అక్షరం: మీ పేరులోని మొదటి అక్షరం:

పాన్ కార్డ్ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని (Surname) మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు.. మీ ఇంటి పేరు ‘Chityala’ అయితే.. ఐదో అక్షరం ‘c’ ఉంటుంది. ఒకవేళ అది కంపెనీ అయితే.. కంపెనీ పేరులోని మొదటి అక్షరం ఇక్కడ వస్తుంది.

4. ఆరో నుంచి తొమ్మిదో అంకెలు (0001 to 9999):

ఈ నాలుగు అంకెలు సీరియల్ నంబర్లు. ఆదాయపు పన్ను శాఖ తన డేటాబేస్ ప్రకారం 0001 నుంచి 9999 మధ్య ఏదో ఒక నంబర్‌ను కేటాయిస్తుంది.

Also Read:పండుగ వేళ పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

5. పదో అక్షరం: ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్:

చివరి అక్షరం ఒక ‘చెక్ డిజిట్’. ఇది పైన ఉన్న తొమ్మిది అక్షరాలను ఒక నిర్దిష్ట గణిత సూత్రం (Formula) ద్వారా లెక్కించి కంప్యూటర్ కేటాయిస్తుంది. ఇది కార్డు యొక్క ప్రామాణికతను నిర్ధారిస్తుంది.

పాన్ కార్డ్ నంబర్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక గుర్తింపు పత్రం. ఇందులో నాలుగో, ఐదో అక్షరాలు ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అందిస్తాయి. అందుకే మీ పాన్ నంబర్ గురించి అవగాహన ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో మోసాలను గుర్తించడం సులభమవుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×