E-Paper
Advertisement

Gold Rate Increased: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఒక్కసారిగా భారీగా పెరగడానికి కారణాలివే!

Gold Rate Increased: తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఒక్కసారిగా భారీగా పెరగడానికి కారణాలివే!
Advertisement

Gold Rate Increased: గడిచిన కొద్ది రోజులుగా ఒడిదుడుకులకు లోనైన బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అనిశ్చితి, అమెరికా-గ్రీన్లాండ్ మధ్య తలెత్తిన వివాదాలు ఇన్వెస్టర్లను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం వంటి అంశాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. ఈ పరిణామాల వల్ల నిన్నమొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన పసిడి ధర, ఒక్కసారిగా మళ్లీ పుంజుకుంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,600 ఉండగా.. నేడు సోమ‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,840 వద్ద ఉంది. అలాగే శ‌నివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550 కాగా.. నేడు సోమ‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.2,240 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,58,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,840 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,600 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,990 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,750 వద్ద ఉంది.

Also Read: అద్దె ఇల్లు రెంట్ Vs సొంత ఇంటి ఈఎంఐ.. ఏది బెటర్ ఆప్షన్?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. బంగారంతో పాటు సిల్వ‌ర్ ధ‌ర‌లు కూడా దూసుకెళ్తున్నాయి.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. శ‌నివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 కాగా.. నేడు సోమ‌వారం కేజీ సిల్వర్ ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.15,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో ప్రస్తుత ధర రూ. 3,00,000 వద్ద పలుకుతోంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×