E-Paper
Advertisement

Ola Self Driving Scooter: మీకు డ్రైవింగ్ రాదా.. ఏం పర్లేదు.. ఈ స్కూటీనే మిమ్మల్ని తీసుకెళ్తుంది

Ola Self Driving Scooter: మీకు డ్రైవింగ్ రాదా.. ఏం పర్లేదు.. ఈ స్కూటీనే మిమ్మల్ని తీసుకెళ్తుంది
Advertisement

Ola Self Driving Scooter: ఆటో మొబైల్ రంగంలో ఊహించని అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ కంపెనీలు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఈ తరుణంలో వినూత్న ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త బైక్‌లు, కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ మేరకు ఓలా సీఈఓ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓలా కంపెనీ కొత్తగా డెవలప్ చేసిన సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్‌ను టెస్ట్ చేసిన వీడియో ఒకటి షేర్ చేశారు. ఇండియాలో మొట్టమొదటి అటానమస్ స్కూటర్ గా దీనికి పేరు లభించింది. దీనిని ఓలా సోలో పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఈ స్కూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రకటనని చాలా మంది నమ్మలేదు. ఏప్రిల్ కాబట్టి అందరినీ ఫూల్స్ చేసేందుకే ఇలా చేశారని కామెంట్స్ చేశారు. ఇదొక ప్రాంక్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజమే అని మంగళవారం వీడియోను షేర్ చేస్తూ సీఈఓ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది ఏప్రిల్ ఫూల్ చేసేందుకు జోక్ కాదు. మేము దీనిని నిన్న ప్రకటించాం. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది దీనిపై చర్చ జరిపారు. ఇది ఒక ఏప్రిల్ ఫూల్ జోక్ అంటూ కామెంట్స్ చేశారు. మా ఇంజినీర్లు దీనిని కొత్త కొత్త సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Also Read: ఈ స్కూటర్ అమ్మకాలు భలే భలే.. మార్చి నెలలో మహా అద్భుతం..!

Advertisement

ఓ పార్కింగ్ స్థలంలో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళిపోతున్న బైక్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ట్రాఫిక్ స్మార్ట్, ఏఐ ఎనేబుల్, అటానమస్, వంటి ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని రెడీ చేశారు. వీడియోను షేర్ చేసిన మరు క్షణమే ఈ బైక్ సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది. ఒకవేళ ఈ బైక్ కనుక సక్సెస్ అయితే.. ఇండియా మార్కెట్లోనే ఓలా అందుకోలేనంత ఎదిగిపోతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఓలా షేర్ చేసిన వీడియోలో ఎలక్ట్రిక్ బైక్ దానంతట అదే వెళుతుంది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఆగిపోతుంది. మలుపులు ఉన్న చోట నెమ్మదిగా మలుపులు తిరుగుతుంది. ఇలా దానంతట అదే వెళ్లడాన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది మార్కెట్లోకి వచ్చిన మరుసటి రోజే మొదట కొనుగోలు చేసే వ్యక్తిని నేనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×