E-Paper
Advertisement

OLA Shakti 9.1kWh: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం, పోర్టబుల్ పవర్ స్టోరేజ్ వచ్చేసింది!

OLA Shakti 9.1kWh: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం, పోర్టబుల్ పవర్ స్టోరేజ్ వచ్చేసింది!
Advertisement

ఓలా ఎలక్ట్రిక్ ఎనర్జీ రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. 4680 భారత్ సెల్స్ తో నడిచే దేశంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) సొల్యూషన్ అయిన ఓలా శక్తి 9.1kWh డెలివరీలను ప్రారంభించింది.  ఓలా శక్తి 9.1kWhతో పాటు 6Kw కాన్ఫిగరేషన్ డెలివరీలను బెంగళూరులో మొదలుపెట్టింది. మరికొద్ది నెలల్లో దేశ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపింది.  పూర్తి స్వదేశీ టెక్నాలజీతో (4680 భారత్ సెల్స్) తయారైన మొట్టమొదటి హోమ్ బ్యాటరీ సొల్యూషన్ గా ఓలా శక్తి గుర్తింపు తెచ్చుకుంది.

ఓలా శక్తి 9.1kWh గురించి..    

ఓలా శక్తి 9.1kWh డెలివరీలు తాజాగా బెంగళూరులో ప్రారంభం కాగా, త్వరలో దేశ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. 6kW పవర్ అవుట్‌ పుట్, 9.1kWh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో కూడిన 4680 భారత్ సెల్స్‌ తో ఈ వ్యవస్థ పని చేస్తుంది. పూర్తి లోడ్‌పై 1.5 గంటల వరకు పవర్ బ్యాకప్ అందిస్తుంది.

ఇంటి అవసరాలకు అనుగుణంగా..

Advertisement

ఓలా శక్తి బ్యాటరీ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇండక్షన్ కుక్కర్లు, వ్యవసాయ పంపులు, కమ్యూనికేషన్ పరికరాలకు పవర్ ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం 2 గంటల వరకు ఉంటుంది. పూర్తి లోడ్‌ లో 1.5 గంటల వరకు బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ వెంటనే పవర్ ఛేంజ్, వెదర్ రెసిస్టెన్స్ IP67 రేటెడ్ బ్యాటరీలు, కనెక్ట్ చేయబడిన యాప్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణతో అమర్చబడి ఉంటుంది.

రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి!

ఓలా శక్తి బ్యాటరీ నాలుగు కాన్ఫిగరేషన్లలో వస్తుందని లాంచింగ్ సమయంలో  ఓలా ఎలక్ట్రిక్ CMD భవేష్ అగర్వాల్ వెల్లడించారు. 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh గా వస్తుందన్నారు. 1.5 kWh ధర రూ. 29,999, 3 kWh ధర రూ. 55, 999, 5.2 kWh ధర రూ. 1,19,999, 9.1 kWh ధర రూ. 1,59,999 ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కేవలం  6Kw, 9.1kWh వేరియంట్లలో మాత్రమే వచ్చింది. 9.1kWh  ధర రూ. 2,49,999గా నిర్ణయించింది.   ఓలా శక్తి 3Kw, 5.2kWh వేరియంట్‌ తో పాటు ఇవి కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ను పొందినట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది.

Advertisement

Read Also: గ్రీన్ ఎనర్జీకి బడ్జెట్ బూస్ట్.. 4000 ఈ-బస్సులు, పర్యాటకానికి పెద్దపీట!

ఓలా ఎలక్ట్రిక్ ఏం చెప్పిందంటే?  

ఓలా ఎలక్ట్రిక్ పోర్టబుల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్  డెలివరీ సందర్భంగా అగర్వాల్ కీలక విషయాలు వెల్లడించారు.  ఈ పరికరాన్ని ఇళ్లు, పొలాలు, వ్యాపారాలకు అనుగుణంగా రూపొందించిన పోర్టబుల్, ఆన్ డిమాండ్ పవర్ సప్లయర్ గా అభిప్రాయపడ్డారు.  వీటి ద్వారా భరత్ పవర్ కొరతను ఎదుర్కొంటుందన్నారు.

Read Also: కాన్ఫిడెంట్ తో వ్యాపార సమ్రాజ్యాన్ని నిర్మించి.. కాన్ఫిడెంట్ కోల్పోయి ప్రాణాలు తీసుకుని..

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×