E-Paper
Advertisement

Nissan Magnite Discount: ఈ ఆఫర్లు వదలొద్దు మావా.. నిస్సాన్ మాగ్నైట్‌పై ఏకంగా రూ.82 వేలకు పైగా డిస్కౌంట్..!

Nissan Magnite Discount: ఈ ఆఫర్లు వదలొద్దు మావా.. నిస్సాన్ మాగ్నైట్‌పై ఏకంగా రూ.82 వేలకు పైగా డిస్కౌంట్..!
Advertisement

Nissan Magnite discount: ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది కారును కొనేందుకు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే మరికొన్ని కంపెనీలు మాత్రం దేశీయ మార్కెట్‌లో కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కార్లపై ఆఫర్లు ప్రకటించి ఆకట్టుకుంటున్నాయి. ప్రతి నెలా కంపెనీలు తమ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.

ఇక ఇప్పుడు పండుగ సీజన్ సమీపిస్తున్నందున వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెలలో అంటే ఆగస్టులో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ కార్లపై కిక్కిచ్చే ఆఫర్ ప్రకటించింది. కంపెనీ తన మాగ్నైట్ ఎంట్రీ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీపై ఈ ఆగస్టు 2024 లో రూ.82,600 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. అందులో క్యాష్ డిస్కౌంట్స్‌, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీపై అనేక ఆఫర్లు ఉన్నాయి.

Advertisement

Also Read: తొలి ICE వెర్షన్‌గా బసాల్ట్ ఎస్యూవీ కూపే లాంచ్.. చాలా తక్కువ ధరలోనే..!

ఎంట్రీ లెవెల్ ఎక్స్‌ఈ నాన్ టర్బో వేరియంట్‌పై రూ.7000 క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే కార్పొరేట్ బోనస్‌ కింద రూ.10,000 లభిస్తుంది. ఇక నాన్ టర్బో మాగ్నైట్ వేరియంట్లపై రూ.22,000 క్యాష్ బెనిఫిట్స్ పొందొచ్చు. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.35,000 లభిస్తుంది. అలాగే కార్పొరేట్ బోనస్ కింద రూ.10,000 పొందొచ్చు. ఈ వేరియంట్‌తో పాటు మాగ్నైట్ ఈజెడ్-షిఫ్ట్ ఏఎంటీ వేరియంట్లపై రూ.15,000 క్యాష్ బెనిఫిట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.30,000, కార్పొరేట్ బోనస్ కింద రూ.5,000 లభిస్తుంది. వీటితో పాటు నిస్సాన్ మాగ్నైట్ టర్బో పెట్రోల్ వేరియంట్లపై కంపెనీ ఏకంగా రూ.80,600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement

అందులో క్యాష్ బెనిఫిట్ రూ.25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.30,000, కార్పొరేట్ బోనస్ రూ.10,000 ఉన్నాయి. ఈ వేరియంట్‌తో పాటు మాగ్నైట్ టర్బో సీవీటీ వేరియంట్‌పై రూ.20,000 క్యాష్ తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.30,000, కార్పొరేట్ బోనస్ రూ.5,000 పొందొచ్చు. అందువల్ల మీకు నచ్చిన వేరియంట్‌ను మంచ డిస్కౌంట్‌తో కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయం. అయితే ఈ ఆఫర్లు కేవలం ఆగస్టు 2024 నెల వరకు మాత్రమే ఉంటాయి. కాగా ఈ నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా మార్కెట్‌లో పేరు గాంచింది. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో బ్రెజా, నెక్సాన్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×