E-Paper
Advertisement

Pan Card Rules: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచి వీటికి మాత్రమే తప్పనిసరి

Pan Card Rules: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచి వీటికి మాత్రమే తప్పనిసరి
Advertisement

Pan Card Rules: ఆదాయపు పన్ను నిబంధనలు 2026 డ్రాఫ్ట్ సిద్ధమవుతుంది. పాన్ కార్డు రూల్స్ లో భారీ మార్పులు రానున్నాయి. నగదు డిపాజిట్లు, విత్ డ్రా, ఇతర హై వ్యాల్యూ లావాదేవీల పరిమితుల మార్పునకు ప్రతిపాదనలు చేశారు. పన్ను బేస్‌ను పెంచడానికి, చిన్న లావాదేవీలకు పాన్ కార్డు రిపోర్టింగ్ భారాన్ని తగ్గించడానికి రూల్స్ మార్చనున్నారు.

ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న రూల్స్ లో ముఖ్యంగా రెండు ప్రధాన మార్పులున్నాయి. బ్యాంకు ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు, రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా అమ్మడం ఉంటాయి. వ్యక్తులు, వ్యాపారులు నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు సంబంధించి 5 ముఖ్యమైన పాన్-మార్పులు చేయనున్నారు.

1.బ్యాంకులు/పోస్టాఫీసులలో వార్షిక నగదు డిపాజిట్లకు పాన్ తప్పనిసరి

Advertisement

ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం డ్రాఫ్ట్ ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల నుంచి మొత్తం నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు రూ. 10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరిగా రిపోర్టు చేయాలి. ప్రస్తుతం ఒకే లావాదేవీలో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లకు పాన్ కార్డు రిపోర్టు చేయాల్సి ఉంది. కొత్త రూల్ ప్రకారం చిన్న లావాదేవీలకు పాన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద లావాదేవీల్లో పన్ను ఎగవేతను నిరోధించేందుకు ఈ మార్పు చేయనున్నారు. ఈ ప్రతిపాదనతో బ్యాంకులపై భారం తగ్గనుంది.

2.స్థిరాస్తి లావాదేవీలు

ప్రస్తుత పాన్ నిబంధన మేరకు రూ. 10 లక్షలకు మించి రియల్ ఎస్టేట్ లావాదేవీలకు పాన్ కోట్ చేయడం తప్పనిసరి. కొత్త రూల్స్ మేరకు ఈ మొత్తా్న్ని రూ. 20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీలపై నిఘా ఉంచుతూనే, చిన్న రియల్ ఎస్టేట్ లావాదేవీలపై భారాన్ని తగ్గించనున్నారు.

3.హోటల్, ఈవెంట్ చెల్లింపులకు అధిక పాన్ లిమిట్

Advertisement

ప్రస్తుతం, రూ.50,000 దాటిన హోటల్, రెస్టారెంట్ బిల్లుల చెల్లింపులు పాన్‌ను సబ్‌మిట్ చేయాలి. కొత్త చట్టం ప్రకారం ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచనున్నారు.

4.బీమా కోసం పాన్ తప్పనిసరి

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియంలు రూ. 50,000 దాటిన పాలసీలకు పాన్‌ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే, ముసాయిదా నియమాలు బీమా పాలసీలకు సంబంధించిన పాన్ పరిధిని పెంచనున్నారు. బీమా కంపెనీలతో అన్ని లావాదేవీలకు పాన్ తప్పనిసరి కానుంది.

Also Read:  కొత్త ఏసీ కావాలా? పానాసోనిక్ నుంచి అడ్వాన్స్డ్ ఏసీలు.. 57 రకాల మోడళ్లలో..!

5.ఆస్తి, వాహన కొనుగోళ్లు- పాన్ పరిమితుల్లో మార్పు

ప్రస్తుత నిబంధన ప్రకారం, అన్ని వాహనాల కొనుగోళ్లకు (ద్విచక్ర వాహనాలు తప్ప) పాన్ అవసరం ఉంటుంది. అయితే, రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన బైక్ లేదా కార్ల కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి కానుంది. ఈ మార్పులు ఖరీదైన మోటార్‌సైకిళ్లకు వర్తిస్తాయి కానీ ట్రాక్టర్లకు కాదు. లగ్జరీ బైక్ లు, అధిక-విలువ లావాదేవీలపై పాన్ రిపోర్టు నిబంధనలలో మార్పులు చేయనున్నారు. అదే సమయంలో తక్కువ-విలువైన కార్ల కొనుగోళ్లకు పాన్ సమ్మతిని తగ్గించనున్నారు.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×