E-Paper
Advertisement

Digital Payments: డిజిటల్ చెల్లింపుల్లో మార్పులు.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్

Digital Payments: డిజిటల్ చెల్లింపుల్లో మార్పులు.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్
Advertisement

Digital Payments: ఆర్బీఐ అన్ని డిజిటల్ లావాదేవీలకు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరి చేసింది. దీంతో ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మారనుంది. ఇకపై ప్రతి డిజిటల్ చెల్లింపు లావాదేవీకి కనీసం రెండు విభిన్న అంశాలను ఉపయోగించి ధృవీకరించాలని ఆర్బీఐ ఆదేశించింది. పాస్‌వర్డ్‌లు లేదా పాస్‌ఫ్రేజ్‌లు, పిన్‌ నెంబర్లు, SMS ఆధారిత OTPలు, హార్డ్‌వేర్ టోకెన్‌లు లేదా కార్డులు, సాఫ్ట్‌వేర్ టోకెన్‌లు, వేలిముద్రలు లేదా ఫేస్ ఐడెంటిఫికేషన్ బయోమెట్రిక్స్ ఇకపై టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాటించాలి. బ్యాంకులు, కార్డు నెట్‌వర్క్‌లు, ఫిన్‌టెక్‌లు ఇకపై కచ్చితంగా ఈ రూల్ ను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది.

ముఖ్యమైన అంశాలు

  • అన్ని డిజిటల్ చెల్లింపులకు టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి
  • ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా రూపొందించాలి.
  • ఏదైనా మోసం జరిగితే, జారీచేసేవారిదే బాధ్యత .
  • రిస్క్ బెస్డ్ అథెంటికేషన్ కు అదనపు తనిఖీలు అవసరం
  • అక్టోబర్ 1, 2026 నుంచి క్రాస్ బోర్డర్ చెల్లింపులకు అథెంటికేషన్ అవసరం

కొత్త ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తూనే, భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కొత్త రూల్స్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత పదేళ్లుగా యూపీఐ, మొబైల్ వాలెట్లు, ఫిన్‌టెక్ ఆవిష్కరణల కారణంగా దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. అలాగే మోసాలు, ఫిషింగ్ దాడులు, అనధికార లావాదేవీలు కూడా పెరిగాయి. దీంతో ఆర్బీఐ భద్రతా ప్రమాణాలను మరింత పెంచింది. సిమ్ స్వాప్‌లు, ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్‌ వంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్ ను అమల్లోకి తెస్తుంది ఆర్బీఐ.

Advertisement

ఆర్‌బీఐ కొత్త డిజిటల్ చెల్లింపు సెక్యూరిటీ నిబంధనలు ఒక ముఖ్యమైన పునర్‌వ్యవస్థీకరణ అని నిపుణులు అంటున్నారు. ఓటీపీ ఆధారిత విధానం కంటే టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ పటిష్టంగా ఉంటుందని అంటున్నారు. గతంలో ఓటీపీ ఆధారంగా చెల్లింపులు జరిగేవి. దీంతో ఫిషింగ్ మోసాలు, సిమ్ మార్పిడి, మాల్వేర్ అటాక్, ఓటీపీ డెలివరీ సమస్యలు ఉండేవి. కొత్త నిబంధనలు బయోమెట్రిక్స్ తో మల్టీ ఫ్యాకట్ర్ అథెంటికేషన్ అందిస్తున్నాయి. బయోమెట్రిక్స్, డివైస్ బైండింగ్, అడాప్టివ్ అథెంటికేషన్‌లు లావాదేవీలను మరింత పటిష్టం చేయనున్నాయి.

ఉదాహరణకు:

  • OTP + PIN
  • బయోమెట్రిక్ + డివైస్ బైండింగ్
  • టోకెన్ అథెంటికేషన్ + పాస్‌వర్డ్

ఇవి రియల్-టైమ్ సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. దీనివల్ల మోసాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. సరైన ప్రామాణిక నియమాలను పాటించకపోతే.. ఏదైనా మోసం జరిగితే జారీచేసేవారు సాధారణంగా ఒక బ్యాంకు లేదా చెల్లింపు చేసేవారు కస్టమర్‌కు పూర్తి నష్టపరిహారం చెల్లించాలి. భద్రతా బాధ్యతను వినియోగదారుడి నుంచి సంస్థకు మారుస్తున్నారు. దీంతో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఫాలో అవుతాయి.

 బ్యాంకుల పర్యవేక్షణ

  • మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లు
  • లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం
  • ప్రతి దశలోనూ నిబంధనల పాటించడం
  • డిజిటల్ లావాదేవీలలో ఆర్‌బీఐ నిబంధనలు
Advertisement

Also Read: ఆన్లైన్ పేమెంట్స్.. ఆపేదెవ్వరు! ఒక్క ఏడాదిలో ఎంత మార్పు

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×