E-Paper
Advertisement

LIC కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్రాంచ్‌కు వెళ్లనవసరం లేదు

LIC కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్రాంచ్‌కు వెళ్లనవసరం లేదు
Advertisement

My LIC App: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పాలసీదారులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల MyLIC, Super Sales Saathi అనే రెండు కొత్త మొబైల్ యాప్‌లను ప్రారంభించింది. ఎల్ఐసీ సేవలను మరింత డిజిటల్, యూజర్-ఫ్రెండ్లీ చేసే దిశగా రెండు కొత్త యాప్ లను అందుబాటులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. ఈ రెండు యాప్‌లు LIC DIVE (డిజిటల్ ఇన్నోవేషన్,వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్) ప్లాట్‌ఫామ్ ద్వారా పనిచేయనున్నాయి. ఇవి వేగవంతమైన సర్వీస్ డెలివరీ, మెరుగైన భద్రత, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి పెట్టాయి.

మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు ఎల్ఐసీ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పేపర్ లెస్ వర్క్, బ్రాంచ్ లకు తిరగడం తగ్గించడం, విధాన సేవలను ఎప్పుడైనా యాక్సెస్ చేసేందుకు ఈ యాప్ లు ఉపయోగపడనున్నాయి.

MyLIC యాప్

Advertisement

MyLIC యాప్ కస్టమర్ల కోసం తీసుకొచ్చిన సమగ్ర ప్లాట్ ఫామ్. దీని ద్వారా పాలసీదారులు బ్రాంచ్‌కు వెళ్లకుండా లేదా ఏజెంట్లపై ఆధారపడకుండా తమ పాలసీలను నిర్వహించుకోవచ్చు. ప్రీమియంలు చెల్లించడం, ఇతర ప్రయోజనాలను తెలుసుకోవచ్చు. దానితో పాటు, ఈ యాప్ ద్వారా కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాలసీలను కొనుగోలు చేయవచ్చు. ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. ఎలాంటి కాగితంతో పనిలేకుండా లోన్ కూడా అప్లై చేయవచ్చు. దీంట్లో ఒక ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే, గడువు ముగిసిన పాలసీలను యాప్ ద్వారానే చేసుకునే అవకాశం ఉండటం. ఇంతకు ముందు రివైవల్ కు చాలా సమయం పట్టేది.

MyLIC యాప్ ఫీచర్లు

  • పాలసీ ప్రాసెస్
  • ప్రీమియం పేమెంట్
  • ప్రయోజనాలు ట్రాకింగ్
  • ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు
  • ఇ-కేవైసీ, పేపర్ లెస్ లోన్
  • గడువు ముగిసిన పాలసీల రివైవల్

సూపర్ సేల్స్ సాథీ యాప్

LIC తీసుకొచ్చిన రెండో యాప్ సూపర్ సేల్స్ సాథీ. ఇది ప్రత్యేకంగా LIC ఏజెంట్ల కోసం రూపొందించారు. ఇందులో కస్టమర్ మేనేజ్‌మెంట్, రియల్-టైమ్ అప్‌డేట్‌లు, ఆటో-రిమైండర్‌లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

సూపర్ సేల్స్ సాథీ యాప్ ఫీచర్లు

  • AI ఆధారిత సూచనలు
  • డిజిటల్ సేల్స్ కిట్
  • పనితీరు డాష్‌బోర్డ్
Advertisement

ఈ ఫీచర్లన్నీ కలిసి ఏజెంట్లు సులభంగా డేటా యాక్సెస్ చేయడానికి, రెన్యువల్ డేటాను సులభంగా పొందడానికి ఉపయోగపడుతుంది.

Also Read:  ఎల్ఐసీ బంపర్ ఆఫర్ – రూ.490కే లక్ష రూపాయల పాలసీ

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×