E-Paper
Advertisement

Micro Finance Loan: ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల లోన్… ఎవరు అర్హులంటే?

Micro Finance Loan: ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.25 లక్షల లోన్… ఎవరు అర్హులంటే?
Advertisement

Micro Finance Loan: ఏడాదికి రూ.3 లక్షల వరకు సంపాదించే వారు లేదా తక్కువ ఆదాయ వర్గాలకు ఇచ్చే రుణాలను మైక్రో ఫైనాన్స్ లోన్స్ అంటారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రూ.1.25 లక్షల వరకు మైక్రో ఫైనాన్స్ లోన్ పొందడానికి ఎలాంటి పూచీకత్తు పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారులకు, పిల్లల స్కూల్ ఫీజులు, అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే చిన్న మొత్తాలకు మైక్రో ఫైనాన్స్ రుణాలు పొందవచ్చు. బ్యాంకు క్రెడిట్ యాక్సెస్ లేని వారికి ఈ రుణాలు ఎంతగానే సహాయపడతాయి. మైక్రోఫైనాన్స్ కింద ఎంత వరకూ లోన్ ఇస్తారు. తిరిగి చెల్లించే విధానం, కాలపరిమితి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మైక్రో ఫైనాన్స్ రుణాల ముఖ్య విషయాలు

  • మైక్రో ఫైనాన్స్ లోన్… రూ.10,000 నుంచి రూ.1.25 లక్షలు ఇస్తారు. .
  • తిరిగి చెల్లించే కాలపరిమితి: 1 నుంచి 3 సంవత్సరాలు (చిన్న లోన్లకు 12–24 నెలలు ఉంటుంది)
  • లోన్ ను ముందుగా చెల్లించాలనుకుంటే..ఎలాంటి ఫ్రీక్లోజర్ ఛార్జీలు ఉండవు.
  • వారానికోసారి, 15 రోజులకు ఒకసారి లేదా నెలవారీగా లోన్ తిరిగి చెల్లించవచ్చు.
  • ఈఎంఐ.. ఆదాయంలో 50% మించకూడదు.

వడ్డీ రేట్లు

మైక్రోఫైనాన్స్ రుణాల వడ్డీ రేట్లపై స్థిరమైన పరిమితి లేదు, కానీ అధికంగా వసూలు చేయకూడదు. రిస్క్ ఆధారంగా, బోర్డు నిర్ణయించిన విధంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. నిధుల ఖర్చు, రిస్క్ ప్రీమియం, మార్జిన్‌ ఆధారంగా వడ్డీ రేట్ ఉంటుంది. వడ్డీ రేట్లను మైక్రో ఫైనాన్స్ బోర్డు అధికారిక సమీక్షలో ఆమోదించాల్సి ఉంటుంది. అందుకే ఏకపక్షంగా వడ్డీ రేట్లు నిర్ణయించడానికి అవకాశం ఉండదు.

మైక్రోఫైనాన్స్ లోన్ ఇచ్చే సంస్థలు

  • ఆర్బీఐ కంట్రోల్ ఉన్న సంస్థలు మాత్రమే మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అవేంటంటే
  • బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు
  • ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
  • NBFCలు, NBFC-MFIలు (సూక్ష్మ రుణ సంస్థలు)
  • సహకార బ్యాంకులు, సహకార సంస్థలు
  • స్వయం సహాయక బృందాలు (SHG), ఎన్జీవోలు
  • కమర్షియల్, పేమెంట్ బ్యాంకులు.. మైక్రో ఫైనాన్స్ రుణాలు ఇవ్వవచ్చు.

మైక్రోఫైనాన్స్ లోన్‌కు పొందడానికి అర్హులు

  • భారతీయ పౌరుడై ఉండాలి
  • వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉండాలి.
  • వయస్సు 18- 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • మొత్తం నెలవారీ ఈఎంఐ కుటుంబ ఆదాయంలో 50% మించకూడదు
  • చిన్న వ్యాపారాలు, వర్కింగ్ కేపిటల్ అవసరాలు, పరికరాల కొనుగోలుకు రుణాలు అందిస్తారు.
  • క్లీన్ క్రెడిట్ హిస్టరీ అవసరం
Advertisement

Also Read: ముద్ర లోన్​ పేరుతో మోసాలకు తెరలేపిన గ్యాంగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×