E-Paper
Advertisement

క్రెడిట్ కార్డుతో డబ్బు ఆదా.. ఈ టిప్స్ పాటిస్తే!

క్రెడిట్ కార్డుతో డబ్బు ఆదా.. ఈ టిప్స్ పాటిస్తే!
Advertisement

Credit Card Tips: క్రెడిట్ కార్డులంటే ఖర్చు.. కానీ వాటిని కరెక్టుగా వాడుకుంటే.. డబ్బు ఆదా చేసుకోవచ్చు. షాపింగ్ కోసం మాత్రమే వాడేవారికి సేవింగ్స్ అంటే కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ, మనం క్రెడిట్‌ కార్డును ఎలా వాడుతున్నామనేదాని ఆధారంగా.. ఖర్చులో సొంత మొత్తాన్ని ఆదా చేయొచ్చు. క్రెడిట్‌ కార్డులతో రివార్డు పాయింట్లు, క్యాష్‌ బ్యాక్‌ అనేక ప్రయోజనాలున్నాయి. క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బు ఆదా చేసుకునే టిప్స్ గురించి తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు సెలక్షన్

మన అవసరాలు, అలవాట్లకు తగిన క్రెడిట్ కార్డును తీసుకోవాలి. మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుని, ఆ కొనుగోళ్లపై రివార్డులు అందించే క్రెడిట్ కార్డు తీసుకుంటే బెటర్. ఉదాహరణకు, మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటే.. టికెట్లపై క్యాష్ బ్యాక్, రివార్డులు ఎక్కువగా ఇచ్చే ట్రావెల్ క్రెడిట్ కార్డును సెలెక్ట్ చేసుకోవాలి. కిరాణా సరుకులు ఎక్కువ కొంటుంటే లేదా షాపింగ్ ఎక్కువ చేస్తుంటే.. ఆ అవసరాలకు తగిన విధంగా కార్డును ఎంచుకోవాలి.

సంస్థలతో టై అప్

Advertisement

క్రెడిట్ కార్డులతో వివిధ బ్రాండ్లు, షాపింగ్ ప్లాట్‌ఫాంలతో టై అప్ అవుతాయి. కొన్ని వస్తువులపై లిమిటెడ్ టైమ్ డీల్స్‌ ఇస్తాయి. షాపులు, రెస్టారెంట్లు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ క్రెడిట్ కార్డు సంస్థలతో కలిసి స్పెషల్ డీల్స్, ప్రమోషన్లను అందిస్తుంటాయి. దీంతో బయట డైనింగ్‌ చేసేటప్పుడు ఛార్జీలు తగ్గడం, సీజనల్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు, ఫెస్టివల్‌ రివార్డులు వస్తాయి. ఈ డిస్కౌంట్లను సరైనా టైమ్ లో వాడుకుంటే ఖర్చులను తగ్గించుకోవచ్చు. రివార్డు పాయింట్లు, వోచర్లతో కూడా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

షాపింగ్

క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేస్తుంటే రివార్డ్ పాయింట్లు పెరుగుతాయి. క్రెడిట్ లిమిట్ లోబడి కార్డులో కొంటుంటే.. డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఆఫర్లపై ఓ కన్నేసి ఉంచాలి. క్రెడిట్ లిమిట్ దాటిపోకుండా కార్డు వాడుకుంటే.. లాయల్టీ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. యాన్యువల్ క్రెడిట్ కార్డు ఫీజు కూడా తిరిగి పొందవచ్చు. అలాగని క్రెడిట్‌ కార్డును ఎక్కువగా వాడకూడదు. ప్రతి నెలా 30-40% కంటే ఎక్కువ ఖర్చు చేయకుండా చూసుకోవాలి.

క్రెడిట్ కార్డు బిల్లు

Advertisement

క్రెడిట్ కార్డులపై రివార్డులు, లాయల్టీ పాయింట్లు పొందడానికి.. సరైన టైంలో బిల్లు పేమెంట్స్ కీలకం. కాబట్టి ప్రతి నెలా జీతం పడగానే క్రెడిట్ కార్డు బిల్లు క్లియర్ చేయడం బెటర్. ఇలా చేస్తే క్రెడిట్ కార్డు బిల్లులపై లేట్ ఫీ, ఎడిషన్ ఛార్జీల బాధ ఉండదు.

జీరో పర్సెంట్ ఏపీఆర్

కొన్ని క్రెడిట్ కార్డు సంస్థలు కొత్త కొనుగోళ్లపై జీరో పర్సెంట్ ఇంట్రడక్టరీ ఏపీఆర్ అందిస్తాయి. కొత్త కార్డులపై 6 నుంచి 21 నెలల పాటు ఈ ఆఫర్ అందిస్తుంటాయి. కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్‌గా సున్న శాతం ఏపీఆర్ ఇస్తాయి. ఇలాంటి కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీ ఉండదు. దీంతో మీ డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Also Read: క్రెడిట్ కార్డు బిల్లులు రిపోర్ట్ చేయాల్సిందే.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

 

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×