E-Paper
Advertisement

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్!

Maruti Suzuki: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్!
Advertisement

Maruti Suzuki Grand Vitara Recall: మీరు మారుతి సుజుకి కార్ లవర్సా? ఫ్లాగ్‌ షిప్ నెక్సా మోడల్ గ్రాండ్ విటారాను  కొనుగోలు చేశారా? అయితే, ఈ వార్త మీ కోసమే. వెంటనే మీరు మీ కారును తీసుకొని కంపెనీ సర్వీస్ సెంటర్ కు తీసుకెళ్లండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కార్లలో పొటెన్షియల్ ఫ్యూయెల్ గేజ్ సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ నేపథ్యంలో సుమారు 40 వేల గ్రాండ్ విటారాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, డిసెంబర్ 9, 2024- ఏప్రిల్ 29, 2025 మధ్య తయారు చేయబడిన 39,506 యూనిట్ల SUVలకు ఈ రీకాల్ వర్తిస్తుందని వెల్లడించింది.

అసలు సమస్య ఏంటంటే?

గ్రాండ్ విటారా కార్లలో ఈ సమస్య సమస్య స్పీడో మీటర్ అసెంబ్లీ లోని ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో ఇవి, కచ్చితమైన ఇంధన స్థితిని చూపించడంలో ఫెయిల్ అవుతున్నట్లు తెలిపింది. డ్రైవర్లు ప్యూయెల్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ప్రకటించింది. పలువురు వినయోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కంపెనీ.. కస్టమర్ భద్రత, వెహికల్ విశ్వసనీయతను నిర్ధారించడానికి రీకాల్‌  ప్రక్రియ మొదలు పెట్టినట్లు మారుతి సుజుకి తెలిపింది.

గ్రాండ్ విటారా వినియోగదారులకు సూచనలు

Advertisement

రీకాల్ ప్రకటన చేసిన నేపథ్యంలో గ్రాండ్ విటారా వినియోగదారులకు మారుతి సుజుకి కీలక సూచలను చేసింది. వారి వాహనాలను తనిఖీ కోసం దగ్గరలో ఉన్న మారుతి సుజుకి డీలర్ వర్క్‌ షాప్‌ లకు తీసుకు వెళ్లాలని సూచించింది. ఒకవేళ కార్లలో నిజంగానే లోపాలు ఉన్నట్లయితే, ఉచితంగానే ఆ సమస్యను సరిచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రీకాల్ ప్రక్రియలో మారుతి సుజుకికి సహకరించేలా,  సమాచారం అందుకున్న వెంటనే వినియోగదారులు త్వరగా తమ కార్లను చెకింగ్ కు తీసుకురావాలని సూచించింది.

Read Also: రైలు కదిలినా డబ్బులివ్వలేదు.. పరిగెట్టి పరిగెట్టి కన్నీళ్లు పెట్టుకున్న చిరు వ్యాపారి!

పవర్‌ ట్రెయిన్ ను పరిశీలించనున్న కంపెనీ సిబ్బంది

Advertisement

మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో ముఖ్యంగా పవర్‌ ట్రెయిన్ లో సమస్యలు తలెత్తాయి. ఈ కారు హుడ్ కింద మూడు ఇంజిన్ ఎంపికలతో అందించబడుతుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆసిపిరేటెడ్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్-CNG, 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. సర్వీస్ సెంటర్ కు వచ్చిన ఈ కార్లను చెక్ చేసి, సమస్యలు ఉంటే అక్కడి సిబ్బంది వీటిని సరిచేసి ఇవ్వనున్నారు.

Read Also:  ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×